Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... మొబైల్ ఫోన్ పైన కరోనావైరస్, ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (22:19 IST)
కోవిడ్ -19ను నివారించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తరచుగా చేతులు కడుక్కోవడం మంచిది. మీరు మొబైల్‌ను మళ్లీ మళ్లీ తాకినప్పుడు మీ చేతుల్లో ఎన్ని బ్యాక్టీరియా, వైరస్‌లను మీరు ఆహ్వానిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నేటి కాలంలో మొబైల్ ఫోన్ అంటే అది లేకుండా ఎవరూ వుండటం లేదు.
 
అది నిత్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం మొబైల్‌ను తాకుతాము, ఆపై మన కళ్ళు, ముఖాన్ని చాలాసార్లు తాకుతాము. ఈ కరోనావైరస్ రోజుల్లో ఇది మనకు చాలా డేంజర్. అందువల్ల, ఇంట్లో ఉన్న ఇతర విషయాల మాదిరిగానే, మన మొబైల్ ఫోన్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అంటే... శానిటైజ్ చేయడం. లేకపోతే ఫోన్ ఉపరితలంపై వుండే బ్యాక్టీరియా, వైరస్‌లు మన చేతులు, ముఖం, శరీరానికి చేరతాయి.
 
అందువల్ల మొబైల్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎలాగంటే- అద్దాలను తుడిచే ఏదైనా మృదువైన వస్త్రం, మీరు దానిని ఉపయోగించవచ్చు. 70% పైగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (రబ్బింగ్ ఆల్కహాల్ అని కూడా దీనిని పిలుస్తారు) లేదా ఇథనలైజ్డ్ ఉత్పత్తి. శామ్‌సంగ్ వెబ్‌సైట్ మార్గదర్శకాల ప్రకారం, మీరు మొబైల్ ఫోన్‌లను శుభ్రం చేయడానికి 70% కంటే ఎక్కువ ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను ఉపయోగించవచ్చు.
 
మొదట, మీ మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మొబైల్ కవర్‌ను కూడా తొలగించండి. ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌తో మృదువైన వస్త్రాన్ని కొద్దిగా తేమ చేయండి. ఎక్కువ తడి పడకుండా జాగ్రత్త వహించండి. ఇప్పుడు ఈ గుడ్డతో మీ మొబైల్‌ను ముందు నుండి వెనుకకు శుభ్రం చేయండి. దీని తరువాత, మొబైల్ కవర్‌ను ముందుకు వెనుకకు శుభ్రం చేయండి. ఇలా చేస్తే కరోనావైరస్ మొబైల్ ద్వారా రాకుండా నిరోధించవచ్చు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments