పసుపుతో ఒత్తిడి మాయమవుతుందా?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (17:09 IST)
ఈ మధ్య కాలంలో చాలా మందికి మానసిక సమస్యలు వస్తున్నాయి. మానసిక రుగ్మతలలో ఎక్కువ మందిని బాధపెట్టేది ఒత్తిడి. దీని నుండి విముక్తి పొందడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగుతున్నారు. ఒత్తిడి వల్ల ఆతురత, కృంగిపోవడం, చిరాకు వంటి మానసిక లక్షణాలు మాత్రమే వస్తాయనుకుంటే పొరపాటే. వీటితోపాటు తలనొప్పి, అజీర్ణం, బరువు తగ్గడం లేదా పెరగడం, బరువులో అనూహ్య మార్పులు, అలసట మొదలగు భౌతిక లక్షణాలు కూడా కనపడతాయి. 
 
మన ఆయుర్వేదంలో ప్రకృతి సిద్ధంగా ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. పసుపు, నిమ్మకాయతో ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక టేబుల్ స్పూన్ మరియు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్. ఈ మూడింటినీ ఒక గ్లాసు నీళ్లలో బాగా కలిపి రోజుకొకసారి ప్రతిరోజూ భోజనం చేయక ముందు త్రాగండి. 
 
అంతే మీ ఒత్తిడి మాయమవుతుంది. పనిలో ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, సంబంధ బాంధవ్యాల సమస్యలు, మానసిక సంక్షోభం, అయోమయం, ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన పడటం ఇలా మొదలగు కారణాల వల్ల కలిగే తీవ్ర ఒత్తిడుల నుండి కూడా తప్పించుకోవచ్చు. ఒత్తిళ్ల వల్ల కలిగే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు మరియు వంధ్యత్వం నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
చాలామంది డిప్రెషన్ తగ్గించుకోవడానికి మద్యం సేవించడం, పొగత్రాగటం, మందులు తీసుకోవడం చేస్తుంటారు. వీటి వలన ఆరోగ్యం క్షీణిస్తుంది. సహజ సిద్ధమైన మందులే చాలా మంచివి. పసుపు శరీరంలో ఉన్న కణాలకు శక్తిని ఇచ్చి పోషిస్తాయి మరియు వ్యాధుల‌పై పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి. పసుపులో ఉండే ప్రతిక్షకారిని మెదడులో ఉండే కణాలను పోషిస్తుంది.
 
ఇంకా ప్రాణవాయువుతో కూడిన రక్తం మెదడుకి అందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి చాలా త్వరగా తగ్గుతుంది. నిమ్మరసం, తేనెలలో కూడా ప్రతిక్షకారినిలు ఉంటాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే కార్టిసోల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. దీనితోపాటు ధ్యానం యోగా కూడా చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ సమోసాలు.. పాడైపోయిన ఉడికించిన కోడిగుడ్లు, వాడిన వంట నూనెను..?

షర్మిల, ఆమె బిడ్డలకు జగన్ అన్యాయంగా ప్రవర్తించాడు.. వైఎస్ విజయమ్మ

హిందూ మహా సముద్రంలో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

ఓ ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం.. మల్కన్‌గిరి ఎమ్మెల్యేతో సహా 35 మంది ప్రయాణికులు సేఫ్

మావోలకు శాంతి భద్రతలు కాదు పునరావాసంపై దృష్టి సారించాం.. భట్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments