Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం బ్లాక్ కాఫీ- మధ్యాహ్నం గ్రీన్ టీ తాగితే?

ఉదయం పూట ఓ కప్పు బ్లాక్ కాఫీ.. మధ్యాహ్నం ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్గానిక్ కాఫీ పొడులతో తయారు చేసే బ్లాక్ క

Webdunia
మంగళవారం, 22 మే 2018 (11:36 IST)
ఉదయం పూట ఓ కప్పు బ్లాక్ కాఫీ.. మధ్యాహ్నం ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్గానిక్ కాఫీ పొడులతో తయారు చేసే బ్లాక్ కాఫీని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.


ఉదయం పూట బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా రోజంతా చురుకుగా వుండగలుగుతారు. ఉదయం ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఆహారాన్ని మితంగా తీసుకోగలుగుతారు. తద్వారా ఒబిసిటీ దరి చేరదు.
 
అలాగే ప్రతిరోజు రెండు లేదా మూడు కప్పుల బ్లాక్‌ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ కాఫీ వల్ల రక్తంలోకి అడ్రినలిన్ విడుదలవుతుందని, దీంతో కొవ్వు కరుగుతుంది. అలాగే, లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ప్రతిరోజు కాఫీ తాగితే శరీర మెటబాలిజం యాభై శాతం వరకు పెరుగుతుంది. ప్రతిరోజు రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బ్లాక్ కాఫీని తీసుకోకపోవడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments