Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంతాలు తెల్లబడటం కోసం వాటిని వాడేస్తున్నారా?

దంతాలు తెల్లగా మారుతాయని.. టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్‌లు విపరీతంగా వాడటం మంచిది కాదు. వీటివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది. దంతాలపై ఉండే ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే శరీరానికి తగినంత ఫ్

Advertiesment
Dental care tips
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:35 IST)
దంతాలు తెల్లగా మారుతాయని.. టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్‌లు విపరీతంగా వాడటం మంచిది కాదు. వీటివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.  దంతాలపై ఉండే ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే శరీరానికి తగినంత ఫ్లోరైడ్ అందుతుండాలి. నోట్లో లాలాజలం ఊరుతూ ఉండాలి. లాలాజలం ఎనామిల్‌ను దెబ్బతీసే బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది.
 
ఇంకా ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్‌ను వినియోగించడం మంచిది. అయితే అధిక స్థాయిలో ఫ్లోరైడ్ వుండకుండా చూసుకోవాలి. మూడు మాసాలకు ఓసారి డెంటిస్టులను సంప్రదించడం మంచిది. కూల్ డ్రింక్స్, యాసిడిటిక్ పదార్థాల్లోని యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి. అందువల్ల దంతాల సంరక్షణ కోసం అలాంటి వాటి వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది. 
 
కూల్ డ్రింక్స్ వంటి వాటిని స్ట్రాలతో తాగడం ద్వారా దంతాలను రక్షించుకోవచ్చు. ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నా కూడా మధ్య మధ్యలో నీటితో పుక్కిలిస్తే దంతాల మధ్య బ్యాక్టీరియా పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఈ విధంగా నోటి దుర్వాసనను కూడా అరికట్టవచ్చు.
 
ఇక దంతాలు ఆరోగ్యంగా వుండాలంటే..?
కాల్షియం ఎక్కువగా ఉండే చీజ్, బాదం పప్పులు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే ఫాస్పరస్ ఎక్కువగా ఉండే మాంసం, గుడ్లు, చేపలు వంటివి తీసుకోవడం ఉత్తమం. ఇవే కాకుండా క్యారెట్, ఆపిల్స్, దోసకాయ వంటి వాటిని నమిలి తినడం ద్వారా దంతాలు ఆరోగ్యంగా వుంటాయి. గ్రీన్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే రసాయనాలు నోటిలో బ్యాక్టీరియా ఎదుగుదలను నియంత్రిస్తాయి. దాంతోపాటు నోటి దుర్వాసనను కూడా అరికడతాయి. రోజూ ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని బ్లాక్ టీతో నోరు పుక్కిలించడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయని వైద్యులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటిపండును రాత్రిపూట తినకూడదట?