Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి కాలంలో రాగి, జొన్న ఇడ్లీలను తింటే..

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (15:47 IST)
వేసవి కాలంలో రాగి, జొన్న ఇడ్లీలను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జొన్న ఇడ్లీలను వారంలో మూడు సార్లు తింటే డయాబెటిస్, అధిక బరువు తగ్గుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌ ఇందులో వుండటం వల్ల ఎముకలకు మేలు చేస్తుంది. 
 
మెటబాలిజం పెరగడానికి ఇది తోడ్పడుతుంది. శరీరానికి శక్తినిచ్చే ఎనర్జీ లెవ్స్‌ను మెయింటైన్‌ చేస్తుంది. బ్లడ్‌ సర్క్యులేషన్‌ను పెంచుతుంది.
 
జొన్నల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా అరుగుతాయి. దాంతో రక్తంలో చక్కెర శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అందుకనే జొన్నలు బరువు తగ్గే ప్రణాళిక ఉన్నవారికి, డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. 
 
మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
 
జొన్నలలో విటమిన్ బీ6 సమృద్దిగా ఉండుట వలన రోజంతా అలసట, నీరసం లేకుండా ఉషారుగా ఉంటారు. రాగిలోని ట్రైటోఫాన్‌ అమీనో యాసిడ్‌, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తొలగించడానికి తోడ్పడతాయి. సహజసిద్ధమైన రిలాక్సెంట్‌ గుణాలు కలిగిన రాగులు తినడం వల్ల కంటి నిండా నిద్ర పడుతుంది. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments