Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగ నిరోధక శక్తిని పెంచే.. పొద్దుతిరుగుడు గింజలు, పెరుగు.. కరోనా కాలంలో..?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (11:57 IST)
క‌రోనా వైర‌స్ ఎక్కువ‌గా రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండేవారికే సోకుతుందని అంద‌రికీ తెలిసిందే. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్నే తీసుకోవాలనే సంగతి విదితమే. కరోనా టైమ్‌లో వ్యాధినిరోధక శక్తి  పెంచుకోవాలంటే.. రోజూ ఆహారంలో పెరుగులో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనికోసం పండ్లు, కూర‌గాయ‌లు, తులసీ క‌షాయం తాగాల‌ని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే రోజూ ఆహారంలో పెరుగును తీసుకోవాలి. పెరుగు ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అంతేకాదు రోగ‌నిరోధ‌క శ‌క్తికి స‌రిప‌డా జింక్ మొత్తాన్ని కూడా అందిస్తుంది. పెరుగు తింటే జీర్ణ‌క్రియ స‌రిగా జ‌రుగుతుంది. అందుకే ఎన్ని ర‌కాల వంటల‌తో‌ తిన్నా చివ‌రిగా పెరుగుతో తింటే ఆరోగ్యంతో పాటు ఎంతో హాయినిస్తుంది. అంతేకాదు, భార‌తీయుల ఆహార మెనూ లిస్ట్‌లో పెరుగు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. 
 
అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల జాబితాలో పొద్దు తిరుగుడు పువ్వులు కూడా చేరాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి.  వీటిని తీసుకోవడం వలన ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్తనాళాలను క్లీన్ చేస్తుంటాయి. ఫలితంగా గుండె సురక్షితంగా ఉంటుంది.  
పొద్దుతిరుగుడు పువ్వులు జీర్ణశక్తిని పెంచుతాయి. 
 
ఈ విత్తనాల్లో ఉండే సెలీనియం, కాపర్‌లు విష వ్యర్థాలను అడ్డుకునే శక్తి ఉంది. ఫలితంగా కోలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటి నుంచి శరీరాన్ని కాపాడతాయి. పొద్దుతిరుగుడు పువ్వుల్లో జింక్ ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

ప్రేక్షకులు ఎక్కువ రావడం వల్లే తొక్కిసలాట... బన్నీ తప్పేమీ లేదు : బోనీ కపూర్

తర్వాతి కథనం
Show comments