Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్లవాపు లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? తగ్గే మార్గం వుందా?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (21:20 IST)
కీళ్లవాపు లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషులలో కంటే స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు, ఐతే సాధారణంగా 40 మరియు 60 ఏళ్ల మధ్య ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లయితే, ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
 
పొగత్రాగేవారిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అభివృద్ధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అస్బెస్టోస్ లేదా సిలికా వంటి కొన్ని ఎక్స్పోజర్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు రుమాటాయిడ్ ఆర్థరైటిస్‌ను అభివృద్ధి చేయడానికి కొంతవరకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో 55 లేదా అంతకన్నా ఎక్కువ  వయస్సు ఉన్నవారికి వ్యాధి నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం.
 
ఆర్థరైటిస్‌ను అడ్డుకునేదెలా?
ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తక్కువ ప్రభావ వ్యాయామాలు కీళ్ళలో కదలిక శ్రేణిని మెరుగుపరచడానికి, కదలికను పెంచడానికి సహాయపడతాయి. వ్యాయామం కూడా కండరాలను బలోపేతం చేయవచ్చు, కీళ్ళ నుండి ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. సున్నితమైన యోగాను కూడా ప్రయత్నించవచ్చు.
 
తగినంత నిద్ర పోవాలి. నొప్పి, అలసట తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఐస్ ప్యాక్స్ వాపు లేదా నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. కండరాల నొప్పికి వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేస్తుంది.
 
 మటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు వైద్యుడు సలహా మేరకు ఆహారం తీసుకోవాలి. అవిసె గింజలు, అక్రోట్లు, విటమిన్లు A, C, E మరియు సెలీనియం వంటి అనామ్లజనకాలు వాపును తగ్గిస్తాయి. బెర్రీలు, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి తీసుకోవచ్చు. పాలకూర, ఫైబర్ వున్నవాటిని తనడం ముఖ్యం. తాజా పండ్లు తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments