Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలేయం కాపాడుకోవాలి, లేదంటే ఆ సమస్యలతో సతమతం

Advertiesment
కాలేయం కాపాడుకోవాలి, లేదంటే ఆ సమస్యలతో సతమతం
, శనివారం, 28 నవంబరు 2020 (22:47 IST)
శరీరంలో పెద్ద గ్రంధి కాలేయం. జీర్ణక్రియ మొదలుకొని ధాతు పరిణామం, వ్యర్థపదార్థాలను శుద్ధి చేయడం వంటి అత్యంత ముఖ్యమైన శరీర క్రియా కార్యకలాపాలను ఎన్నో ఇది నిర్వర్తిస్తుంటుంది. ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయడానికి అవసరమయ్యే పిత్తాన్ని (బైల్) ఉత్పత్తి చేసి, పిత్తాశయం (గాల్‌బ్లాడర్)లో నిల్వ ఉంచుతుంది. కాలేయానికి వ్యాధి సోకితే యకృత్ కార్యకలాపాలన్నీ దెబ్బతింటాయి. జాండిస్ వ్యాధి స్వభావం మూడురకాలుగా ఉంటుంది. 1. వైరల్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ 2. అవరోధజం(అబ్‌స్ట్రక్టివ్) 3. ఎర్తరక్తకణాలు అధిక స్థాయిలో బద్దలవడం (హీమోలైటిక్).
 
కారణాలు: కలుషితమైన ఆహారపదార్థాల సేవన, కలుషితమైన నీరు, ఇతర పానీయాలు, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకులు మొదలైనవి. వీటిద్వారా హానికరమైన కొన్ని రకాల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి లివర్‌ని దెబ్బతీస్తాయి. దీనివల్ల లివర్‌కి వాపు కలిగి పరిమాణం పెరుగుతుంది. బైలురూబిన్ స్థాయి రక్తంలో అధికమై క్రమ క్రమంగా కళ్లు, గోళ్లు, మూత్రంలో పసుపు పచ్చని రంగు పెరుగుతుంది. ముందుగా ఆరంభంలో జ్వరం, వాంతి- భ్రాంతి ఉంటాయి. 
 
ఆకలి మందగించడమే కాకుండా మనం తినే కొవ్వు పదార్థాల జీర్ణక్రియకు కావలసిన బైల్ పేగులలోకి (అంటే ఆంత్రములు) రాదు. వ్యాధి తీవ్రతను బట్టి పొట్ట ఉబ్బరిస్తుంది. కామెర్ల రోగులలో కళ్లు, చర్మం పచ్చగా కనిపిస్తాయి. చర్మం దురదపెడుతుంది. మలం తెల్లగా, మూత్రం పసుపు రంగులో ఉంటాయి. రక్తస్రావం కనిపించొచ్చు. నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే.
 
జాండిస్ ప్రధాన చికిత్స
మెడికేషన్ తర్వాత తీసుకొనే ఆహారం. జాండిస్ ఉన్న వారు సరైన డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె పదార్థాలు తీసుకోవడం మానేయాలి. లివర్ ఎప్పుడైతే వీక్‌గా ఉంటుందో అప్పుడు ఆయిల్ ఫుడ్స్ జీర్ణం చేసుకొనే శక్తి తగ్గిపోతుంది. అయితే ఫ్యాట్ ఫుడ్స్‌ను నివారించడం మాత్రమే కాదు. మంచి ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే.
 
కొన్ని ఆహారాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ డిటాక్స్ ఫుడ్స్‌ను లివర్ సెల్స్‌లో తిరిగి చైతన్యం నింపి, ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. జాండిస్ నివారణకు రసాలు చాలా ప్రభావంతమైన ఆహారాలు. చెరకు రసం లివర్ ఆరోగ్యానికి చాలా సహాయకారిగా పనిచేస్తుంది. కాలేయ సమస్యలను నయం చేయడానికి కొన్ని ఆహారాలున్నాయి. అవి కామెర్లను త్వరగా నయం చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊబకాయంతో కలిగే అనర్థాలు ఇవే...