Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీజన్లతో సంబంధం లేదు.. సపోటాతో బరువు పరార్..

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (22:02 IST)
సపోటాలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సీజన్లకు సంబంధం లేకుండా లభించే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. సపోటాలో విటమిన్ ఏ పుష్కలంలో ఉంటుంది. వృద్ధులు సైతం సపోటా పండును తినడం వల్ల వాళ్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గర్భవతులు, పాలిచ్చే తల్లులు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. రక్తస్రావాన్ని తగ్గించడంలో సపోటా పండ్లు సహాయపడతాయి. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న సపోటా పండ్లు వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
 
గ్లూకోజ్‌ను సమృద్ధిగా కలిగి ఉండే సపోటా తక్షణమే శక్తిని ఇస్తుంది. ఆటలు ఎక్కువగా ఆడేవాళ్లు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. సపోటా పండ్లు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పని చేస్తాయి. వాపు, నొప్పులను తగ్గించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. బాడీలో వేడి పెరిగిపోతే... సపోటాలు తినాలి. వీటిలోని టాన్నిన్... వేడిని పోగొట్టి చలవ చేస్తుంది.
 
సపోటాల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి. సపోటాల్ని రెగ్యులర్‌గా తింటే... ముసలివాళ్లు అయ్యాక... మందులు ఎక్కువగా వాడాల్సిన పని ఉండదు. సపోటాల్లోని ఫోలేట్స్, కాల్షి.యం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలెనియం... ఎముకలు ధృఢంగా మారేలా చేస్తాయి. సపోటాల్లోని మెగ్నీషియం... రక్త నాళాల్ని చురుగ్గా చేస్తుంది. అలాగే పొటాషియం... బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం సరిగా లేని వాళ్లు సపోటాలు తినాలి. బరువు తగ్గాలంటే... బాడీకి వాటర్ ఉండాలి. మెటబాలిజం సరిగ్గా ఉండాలి. ఆ పనిని సపోటాలు చూసుకుంటాయి. ఓ రెండు సపోటాలు తిని... వర్కవుట్ చేసుకుంటే బెటర్.
 
అలాగే కొన్ని క్యాన్సర్లను నివారించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు సపోటా పండ్లలో పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల పటుత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి. సపోటా పండ్లను తీసుకోవడం ద్వారా కాల్షియం, పాస్పరస్, ఐరన్ లభిస్తాయని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments