Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబ్బసం వ్యాధి ఎలా ఉంటుందంటే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (16:01 IST)
ఉబ్బసం వ్యాధి వచ్చిందంటే ఇక ప్రాణం పోయినట్లే అనుకుంటారు చాలామంది. దీన్ని అంటురోగంగా భావించి వ్యాధిగ్రస్తులను దూరంగా పెడుతుంటారు. అయితే కాలం మారిపోయింది. కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ మందులు వాడితో కొంతవరకే ఈ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలుగుతోంది. ఏదైనా కారణం కావచ్చు. అలర్జి కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఏ కారణాలు లేకున్నా ఈ వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వంశపార్యపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
 
ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోయే వ్యాధి కాదు. కాకపోతో తగినంత దానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా వాటి మూలాన కలిగే లక్షణాల తీవ్రత, ఇబ్బందులను నివారించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చును. ఉబ్బసం వలన కలిగే లక్షణాలు ప్రతిసారీ ప్రతిఒక్కరిలో ఒకలాగా ఉండవు. కొన్ని తీవ్రతరంగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న ఉబ్బసంలో గాలి మార్గాలు చాలా వరకు మూసుకోవడం వలన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలకు ప్రాణవాయువు అందడం కష్టమైపోతుంది.
 
ఉబ్బసం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో గాలి మార్గాల లోపలి భాగం వాచినట్టవుతుంది. ఈ వాపు మూలంగా గాలి మార్గాలు సన్న బడుతాయి. ఏవైనా పడని రసాయనాలు, ఇతర పదార్థాల వాసనలు గాలి ద్వారా పీల్చినప్పుడు లేదా నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కవయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 
 
ప్రతిఫలంగా వాటిగుండా ఊపిరితిత్తులకు తక్కువ గాలి చేరడం జరుగుతుంది. దీని కారణంగా ఊపిరి పీల్చినప్పుడు పిల్లి కూతలు, దగ్గు, ఛాతిపట్టినట్టుగా అనిపించడం, శ్వాస పీల్చుకోవడంలో కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే.. రాత్రి సమయంలో, తెల్లవారు జామున ఇటువంటి లక్షణాలు కనబడుతాయి. 
 
ఇది వైద్య అత్యవసర పరిస్థితి, త్వరితగతిన వైద్య సహాయం అందని పక్షంలో ఇది ప్రాణాంతకం కూడా కాగలదు. ఉబ్బసం ఉన్న వ్యక్తులు ఏ కారణం చేత వారికి ఈ లక్షణాలు కలుగుతున్నాయో గుర్తించి అవి కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ వైద్యుని సలహా మేరకు మందులను కూడా వాడుకోవచ్చును.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments