Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరంలో క్యాల్షియం లోపిస్తే..?

శరీరంలో క్యాల్షియం లోపిస్తే..?
, శనివారం, 5 జనవరి 2019 (14:56 IST)
ప్రతిదినము భుజించే ఆహారంలో ప్రధాన పోషకపదార్థాలు, విటమిన్స్ తగినంతగా ఉన్నప్పుడే శరీరానికి లాభాలు.. అవి లోపించినప్పుడు దేహానికి సంబంధించే కీడులు వివరంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
 
కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు):
ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగినంతగా ఉన్నప్పుడు కాలోరీల శక్తి శరీరానికి సక్రమంగా అందింపబడి దేహం చురుకుగా పనిచెయ్యడానికి తోడ్పడుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ ఆహారంలో లోపించినప్పుడు వయసుకు తగిన బరువు లేకపోవుటం, అధికమైన బలహీనత, అపస్మారము వంటివి జరుగుతుంటాయి. 
 
ప్రోటీన్స్ (మాంసకృతులు):
నిత్య భోజన పదార్థాలలో ప్రోటీన్స్ తగిన విధంగా నుండిన యెడల శరీరంలో ఆ ధాతువులు ఉత్పత్తి సక్రమంగా కొనసాగుతుంది. కాలోరీల శక్తి లోపించే సందర్భాలలో ఈ మాంసకృతులు వాటి పనిని కొనసాగించడానికి తోడ్పడగలవు. ప్రోటీన్స్ లోపించినప్పుడు శరీరం యొక్క పెరుగుదల నిలచిపోవుటమే కాకుండా.. ఉండవలసినంత బరువు లేకుండటం, దేహంపై అనారోగ్యకరమైన వాపులు కలుగడం సంభవించును.
 
క్యాల్షియం (సున్నం):
భుజించే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందజేయవలసిన వాటిలో క్యాల్షియం కూడా ఒకటి. క్యాల్షియం లభించినందువలన సక్రమమైన ఎముకల నిర్మాణం, ఎగుడు దిగుడుపళ్ళు, వీటికి బలం, గుండె సరిగ్గా పనిచేయుట, కండరాలు, నరాలు క్రమమైన రీతిగా వాటి పనులు నిర్వహించుట సంభవిస్తుంది. ఈ క్యాల్షియం తగినంతంగా శరీరానికి అందినప్పుడు గిడసబారి పోవడం, పళ్ళు వరుస సక్రమంగా లేకపోవడం, వంకర ఎముకలు, పుచ్చు పళ్ళు, నరాల బలహీనత, త్వరగా వృద్ధాప్యం కలుగుతుంది. పిల్లలలో క్యాల్షియం లోపం కలిగినప్పుడు వారి దేహ పెరుగుదలకు ఆటంకం ఏర్పడడం, మట్టి తినగడానికి అలవాటు పడడం రికెట్స్ అనే వ్యాధికి గురికావలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?