సాధారణంగా ప్రతి మనిషికి అవసరమయ్యే ముఖ్య పదార్థం క్యాల్షియం. ఈ క్యాల్షియం శరీరంలో 99 శాతం ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది. మన శరీరంలో క్యాల్షియం ఉండడం వలనే నిర్మాణ క్రియలు సజావుగా సాగుతున్నాయి. కానీ, ఇప్పటి కాలంలో ఎక్కడ చూసిన ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని చింతిస్తున్నారు. మరి ఈ లోపాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం..
శరీరంలో క్యాల్షియం లేకపోతో చేతి వేళ్లు పటుత్వాన్ని కోల్పోతాయి. దాంతో వేళ్లల్లో తిమ్మర్లు వస్తుంటాయి. ఆకలి చచ్చిపోతుంది. ఒకవేళ తిన్నా కూడా వాంతి వచ్చేస్తుంది. శరీరం వ్యాధి నిరోధకశక్తిని కోల్పోతుంది. తద్వారా కీళ్లనొప్పులు, దంత క్షయం, పిల్లలకు పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. ఇక పెద్దల విషయానికి వస్తే.. గుండె జబ్బులు వచ్చేస్తుంటాయి.
ఈ లోపాన్ని తొలగించాలంటే.. ప్రతిరోజూ తీసుకునే ఆహారపదార్థాల్లో మార్పులు చేయాలి. ఎక్కువగా గుడ్లు, పాలు, బాదం పప్పు, చేపలు, చికెన్, పాలకూర వంటివి తీసుకోవాలి. వీటిల్లోనే క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కనుక తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుకోండి.
ఈ క్యాల్షియం లోపం ఎవరి ఎక్కువగా వస్తుందంటే.. 50 ఏళ్ల నుండి 70 వయసు దాటిన స్త్రీపురుషులకు వస్తుంది. ఎందుకంటే.. వీరు సేవించే ఆహారాల్లో పాల సంబంధిత పదార్థాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక పాలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.. ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.