Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆహార పదార్థాలతో సీజనల్ వ్యాధులను అడ్డుకోవచ్చు...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (18:58 IST)
ఈ కాలంలో ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి తక్కువుగా ఉంటుంది. దీని కారణంగా తరచూ దగ్గు, జలుబు లాంటివి వస్తూ ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వర్షాలు, కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
 
సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
 
1. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమోటా, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. 
 
2. శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.
 
3. ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. 
 
4. ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. దీనిలో ఉండే మినరల్స్ బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 
 
5. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది. దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల అధిక రక్తపోటుని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments