Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొటిమలు నివారించేందుకు 4 మార్గాలు...

మొటిమలు నివారించేందుకు 4 మార్గాలు...
, గురువారం, 25 అక్టోబరు 2018 (15:10 IST)
కొంతమందిలో ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికి మొటిమల సమస్య వేదిస్తుంటుంది. ఈ సమస్యకు చాలా రకాల క్రీంలు వాడినప్పటికి ఉపశమనం లభించినా మరలా మొటిమల సమస్య తలెత్తుతుంది. ప్రకృతి ప్రసాదించిన వెల్లులి మొటిమలకు గొప్ప నివారణా మార్గంగా ఉంది. వెల్లుల్లి, బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే, వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్ వలె పనిచేస్తాయి, క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. 
 
1. వెల్లుల్లి రెబ్బలను మిక్స్ చేసి, అందులో వెనిగర్ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి.ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్‌తో అప్లై చేసుకోవచ్చు. ముఖం మీది మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు వదిలివేయండి, పొడిబారిన తర్వాత ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
 
2. అలోవేరా, చర్మాన్ని చికాకు, వాపు, మొటిమల బారినుండి రక్షించడంలో, మరియు పూర్తిస్థాయిలో నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ముఖం మీద డార్క్ సర్కిల్స్, మృత కణాలను తొలగించడంలో మంచి ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
 
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. మొటిమలు మీద రాసి , 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
4. ఎగ్ వైట్లో, చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు మరియు పోషకాలతో నిండి ఉంటాయి. ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్, తెల్ల గుడ్డు  మిశ్రమంలా కలపండి. మొటిమల ఉన్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.. కొన్ని నిమిషాల పాటు పొడిగా మారే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక, సాధారణ నీటితో కడిగివేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా..?