Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్రలో మే 29, సంఘటనలు వివరాలు

Webdunia
శనివారం, 29 మే 2021 (13:45 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
సంఘటనలు
1947 :రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్ గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.
 
జననాలు
 
1900: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)
1903: బాబ్ హోప్, ప్రపంచ పేరొందిన హాస్యజీవి. (మ.2003)
1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
1917: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
1925: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు.
1947: రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్).
1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
1965: కంచర్ల సుబ్బానాయుడు (పాత్రికేయుడు), రచయిత, సంపాదకుడు, సేవ తెలుగు పత్రిక, ఆంధ్రప్రదేశ్.
1980: ఉష (గాయని), తెలుగు నేపథ్య గాయని.
 
మరణాలు
1829: హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
1928: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
1964: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
1972: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
1975: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)
1987: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1911)
1987: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)
1994: అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత.
1996: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)
2018: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
 
పండుగలు, జాతీయ దినాలు
 
మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.
అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.
ప్రపంచ జీర్ణ ఆరోగ్యం దినం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments