Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం...

Advertiesment
నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం...
, మంగళవారం, 16 మార్చి 2021 (23:13 IST)
సౌర కుటుంబంలోని నవ గ్రహాలలో శుక్రుడు... ఆంగ్లంలో వీనస్ అని పిలుస్తారు. ఈ గ్రహం అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. ఈ గ్రహం సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగి వుంటుంది. దీనిపైన ఉష్ణోగ్రత 445 డిగ్రీల సెల్సియస్ వుంటుందట.
 
నిజానికి మన భూమి పైన 45 డిగ్రీలు దాటితేనే చర్మం కాలుతున్నంత వేడి అనిపిస్తుంది. ఇక 445 డిగ్రీలంటే అక్కడ పరిస్థితి ఎలా వుంటుందో తెలుసుకోవచ్చు. ఏ జీవి అయినా ఆవిరైపోతుందంతే. ఐతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ జీవులు వుండేవని విశ్వసిస్తారు. ఐతే వాతావరణ మార్పులు కారణంగా మన పొరుగునే వుండే శుక్ర గ్రహం పూర్తిగా ఉష్ణమండల గ్రహంగా మారిపోయింది.
 
ఇది నవగ్రహాలన్నిటి కంటే భిన్నంగా తనచుట్టు తాను ఎడమ నుండి కుడికి తిరుగుతూ వుంటుంది. సూర్యుని నుండి సగటు దూరము 10,82,08,900 కిలోమీటర్లు. దీని భ్రమణ కాలం 243 రోజుల 14 నిముషాలు వుంటుంది. గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం 12,102 కిలో మీటర్ల మేర వుంటుంది. సూర్యుడు చుట్టూ పరిభ్రమణ కాలం 225 రోజులు పడుతుంది. మన భూమికి చంద్రుడిలా దీనికి ఉపగ్రహాలు ఏమీ లేవు.
 
రాత్రివేళ చంద్రుడి తరువాత మన కంటికి మెరుస్తూ కనబడుతుంటుంది. ఈ గ్రహానికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా పిలుస్తుంటారు. శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని చేస్తే సరిపోదు.. ఇది కూడా..?