Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ-లావాదేవీలు - ఈ-రుపీ అంటే ఏంటి?

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (09:24 IST)
భారత రిజర్వు బ్యాంకు మరో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ-లావాదేవీలను అమల్లోకి తీసుకునిరానుంది. అంటే ఇకపై ఈ-రూపాయి లావాదేవీలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం దేశ వాణిజ్య రాధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఐటీ క్యాపిటల్ బెంగుళూరు, భువనేశ్వర్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు, ఐసీఐసీఐ, యస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూపు (సీయూజీ)కి మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఈ డిజిటల్ ఈ-రుపీ ఎలా పని చేస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే, డిజిటల్ రూపాయిని వినియోగదారులు, వ్యాపారులకు బ్యాంకులు వంటి మధ్యవర్తుల ద్వారా పంపిణీ చేస్తారు. బ్యాంకులు అందించే వాలెట్ ద్వారా ఈ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చు. 
 
లేదంటే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులమధ్య (పీ2పీ), వ్యాప్తి వ్యాపారి (పీ2ఎం) మధ్య డిజిటల్ రుపీతో లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నట్టుగానే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. భౌతిక నగదు లాగానే ఇది కూడా ఒక భద్రత, సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. అయితే, డిజిటల్ రుపీ మన వాలెట్లలో ఉంటే మాత్రం దానికి వడ్డీ లభించదు. బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంటే మాత్రం కొంతమేరకు వడ్డీ ఇస్తారు. 
 
చట్టపరమైన టెండర్‌ను సూచించే డిజిటల్ టోకన్ మరో రూపమే ఈ-రూపాయిగా పరిగణిస్తారు. క్రిప్టో కరెన్సీలా కాకుండా, పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువను కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments