Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న 500 మందికి పైగా రన్నర్లు

Advertiesment
Run
, గురువారం, 24 నవంబరు 2022 (23:33 IST)
త్వరలో జరుగనున్న ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం శిక్షణా కార్యక్రమాలు ఆదివారం జరిగాయి. దుర్గం చెరువు చుట్టూ 4.4 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ శిక్షణ జరిగింది. దాదాపు 500 మందికి పైగా రన్నర్లు ఈ శిక్షణా సదస్సులో పాల్గొన్నారు. ఈ మారథాన్‌ కోసం అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఆన్‌ ద స్పాట్‌ రిజిస్ట్రేషన్స్‌ సమయంలో ఇది కనిపించింది. ఈ శిక్షణా ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. జనవరి 29, 2023న మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 జరుగనుంది.
 
ఈ సంవత్సరారంభంలో రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ జరిగింది. దాదాపు 3 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్‌ అప్పుడు జరిగాయి. ఈ సంవత్సరం రన్నర్లు 5 కిలోమీటర్ల రన్‌, 10 కిలోమీటర్‌ రన్‌తో పాటుగా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌లో కూడా పాల్గొనవచ్చు. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌‌ను నవంబర్‌ 30, 2022వ తేదీ వరకూ పొడిగించారు. టిక్కెట్ల ధరలను 599 రూపాయలుగా 5కె రన్‌, 1099 రూపాయలకు 10కె రన్‌, 1399 రూపాయలను 21 కె రన్‌కు నిర్ణయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘అబద్దాలు చెప్పని ఆహారం’: ట్రూ ఎలిమెంట్స్ సంచలనాత్మక నూతన క్యాంపెయిన్