Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెనెగల్‌ సంచలనం ... పోలెండ్‌ను కొంపముంచిన సెల్ఫ్ గోల్

ఫిఫా 2018 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా సెనెగల్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ జట్టు తన ప్రత్యర్థి పోలెండ్‌పై 2-1 తేడాతో విజయభేరీ మోగించింది. రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ తొలి రౌండ్‌లో విజయం అ

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:44 IST)
ఫిఫా 2018 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా సెనెగల్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ జట్టు తన ప్రత్యర్థి పోలెండ్‌పై 2-1 తేడాతో విజయభేరీ మోగించింది. రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ తొలి రౌండ్‌లో విజయం అందుకున్న మొదటి ఆఫ్రికా జట్టుగా సెనెగల్‌ నిలిచింది. మంగళవారం గ్రూప్‌ 'హెచ్‌'లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పటిష్ట ప్రత్యర్థి పోలెండ్‌పై 2-1తో నెగ్గింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న సెనెగల్‌ను ఎదుర్కోవడంలో పోలెండ్‌ విఫలమైంది.
 
12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ ఆడుతున్న పోలెండ్‌ తమ డిఫెన్సివ్‌ లోపాలతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు 37వ నిమిషంలో చేసిన సెల్ఫ్‌గోల్‌ వారి కొంపముంచింది. సెనెగల్‌ తరపున 60వ నిమిషంలో ఎం బాయే నియాంగ్‌ గోల్‌ చేయగా పోలెండ్‌ 86వ నిమిషంలో క్రిచోవియాక్‌ గోల్‌ అందించాడు. 
 
తొలి అర్థగంటలో బంతిని 60శాతం పోలెండ్‌ ఆధీనంలోనే ఉంచుకున్నా గోల్‌ మాత్రం చేయలేకపోయింది. దీనికితోడు 38వ నిమిషంలో సొంత గోల్‌ కారణంగా ప్రత్యర్థికి 1-0 ఆధిక్యాన్ని ఇవ్వాల్సి వచ్చింది. సెనెగల్‌ మిడ్‌ఫీల్డర్‌ ఇడ్రిసా గ్వెయె కొట్టిన షాట్‌ను గోల్‌ పోస్టు ముందు పోలెండ్‌ డిఫెండర్‌ థియాగో సియోనెక్‌ కాలితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా కీపర్‌ను తప్పిస్తూ నెట్‌లోకి వెళ్లడంతో పోలెండ్‌ షాక్‌కు గురైంది. ఈ ప్రపంచక్‌పలో నమోదైన 4వ సెల్ఫ్‌గోల్‌ ఇది.
 
ఇక ద్వితీయార్ధంలో స్కోరును సమం చేసేందుకు పోలెండ్‌ విశ్వప్రయత్నం చేయగా, పోలెండ్‌ డిఫెన్స్‌ ఘోర తప్పిదాన్ని సొమ్ము చేసుకుంటూ సెనెగల్‌ ఈసారి తమ ‘సొంత’ గోల్‌ చేసింది. కోర్టు మధ్యలో నుంచి తమ ఆటగాడు క్రిచోవియాక్‌ ఇచ్చిన పాస్‌ను అందుకునేందుకు పోలెండ్‌ గోల్‌కీపర్‌ తన స్థానం నుంచి చాలా ముందుకు వచ్చి అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అతడికి దొరక్కపోవడంతో ఇదే అదనుగా స్ట్రయికర్‌ నియాంగ్‌ సునాయాసంగా గోల్‌ పూర్తి చేయడంతో జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పోలెండ్‌ ఓ గోల్ చేయడంతో 2-1తేడాతో విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments