శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

సెల్వి
గురువారం, 7 ఆగస్టు 2025 (12:11 IST)
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత వుంది. ఈ రోజునే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన శ్రావణ పూర్ణిమను జరుపుకుంటారు. ఈరోజునే రక్షా బంధన్‌ పండుగ జరుపుకుంటారు. అంతే కాకుండా ఈ రోజున మహాశివుడు, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి పూజలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. ఈ శ్రావణ పూర్ణిమ రోజు శివాలయంలో దీపం వెలిగించడం లేదా దీపదానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. 
 
శ్రావణ పౌర్ణమి లేదా శ్రామణ పూర్ణిమ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, సంపదలు కలుగుతాయి. పేదవాళ్లకి, అవసరమైన వాళ్లకి రాఖీ పౌర్ణమి రోజు దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. ఇంకా నువ్వులు, బెల్లం దానం చేయడం, వస్త్ర దానం చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి.
 
శ్రావణ మాసం పూర్ణిమ రోజున బియ్యం, పాలు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహా లక్ష్మీదేవి ఇంట్లో నివాసం వుంటుందని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments