తెలుగు నెలల్లో ఐదవ నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతి రోజూ ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండుగల కోసం ముత్తైదువులు అంతా సిద్ధం చేస్తారు. శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేకత వుంది.
ఈ నేపథ్యంలో శ్రావణమాసం శుక్రవారం పూట ఈ నెల 25 పుట్టింది. ఈ సంవత్సరం శ్రావణమాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగష్టు 23వ తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేయాలి. పాలు, పాయసం రవ్వతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించవచ్చు.
తెలుపు రంగు పువ్వులను సమర్పించవచ్చు. ముత్తైదువులకు తాంబూలం ఇవ్వొచ్చు. సాయంత్రం పూట ఇంటిల్లపాది దీపాలు వెలిగించాలి. తులసీ కోట ముందు దీపం వెలిగించాలి.
ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో శ్రీసూక్తం పఠిస్తే అమ్మవారు చాలా త్వరగా అనుగ్రహిస్తారంట. అలాగే ఈ రోజు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన కనకధారా స్తోత్రం పఠిస్తే పది తరాల వరకు దారిద్య్ర బాధలు ఉండవని శాస్త్రవచనం.
శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి తామర పూలతో చేసిన మాలను సమర్పిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం రెట్టింపవుతుంది. అలాగే ఈ రోజు ముత్తైదులకు తాంబూల దానం చేయడం వల్ల ఐశ్వర్యం కోరుకునే వారికి ఐశ్వర్యం, సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతాయని అంటారు.