Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటికాయ కబాబ్ ఎలా చేయాలో తెలుసా..?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (12:02 IST)
అరటికాయ తీసుకుంటే బరువు తగ్గుతారని చెప్తుంటారు. అలాగని దీనిని పచ్చిగా తీసుకోలేము. కాబట్టి అరటికాయతో కబాబ్ తయారుచేసుకుని తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడితింటారు. మరి ఆ కబాబ్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
అరటికాయలు - 4
పచ్చిమిర్చి - 2
అల్లం పేస్ట్ - 1 స్పూన్
జీలకర్ర పొడి - అరస్పూన్
కొత్తిమీర - 1 కట్ట
నిమ్మరసం - 1 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా అరటికాయలు కుక్కర్లో వేసి అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తరువాత పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. ఈ తురుములో జీలకర్ర పొడి, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. రెండు వైపులా కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కబాబ్‌లను కాల్చుకోవాలి. అంతే... వేడివేడి అరటికాయతో కబాబ్ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

తర్వాతి కథనం
Show comments