Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బొప్పాయి పండును తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:46 IST)
సాధారణంగా చిన్నారులు చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఈ పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. వీటిని తరచుగా తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్లో పిల్లలకు ఇస్తే వారికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా ఉందుతాయి. మరి ఈ సీజన్‌లో దొరికే పండ్లను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఈ కాలంలో బొప్పాయి పండు అధికంగా దొరుకుతుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరొటిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు లవణాలు పిల్లల వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. కనుక ప్రతిరోజూ బొప్పాయి పండును సేవిస్త మెదడు పనీతీరు మెరుగుపడుతుంది.. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బొప్పాయిలో ఎంజైము సమృద్ధిగా ఉంటుంది. భోజనం తరువాత బొప్పాయి పండు తీసుకుంటే కడుపులో ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉంటుంది. 
 
చాలామందికి చిన్నవయస్సులోని కంటి చూపు అంతగా కనిపించదు. దాంతో వైద్య చికిత్సలు తీసుకుంటుంటారు. ఇలా చికిత్సలు తీసుకోవడం కంటే ప్రతిరోజూ బొప్పాయి పండును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే స్త్రీలకు రుతు సమస్యలో వచ్చే నొప్పులతో సతమతమవుతుంటారు. ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఇలా చేస్తే చాలు..
 
బొప్పాయి పండును గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర, నిమ్మరసం, ఉప్పు కలిపి సేవిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కనుక రోజూవారి ఆహారంలో బొప్పాయి పండును తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments