టీనేజ్‌లో పిల్లలకు పోషకాహారం ఇవ్వడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వారికి తెలియజేయడంతో పాటు తీసుకునే ఆహారంలో గల పోషక విలువలను గూర్చి తెలియజేస్తుండాలి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఎక్కువ చక్కెర చేర్చిన ఆహారం, కూల్ డ్రింక్స్, కెమికల్స్ చేర్చిన ఆహారాన్ని తీసుకోనివ్వకుండా చూసుకోవాలి.
క్యాల్షియం, డి విటమిన్ గల ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా గల ఆహారాన్ని తీసుకునేలా చేయాలి. జామ, బొప్పాయి, ఆరెంజ్ వంటి పండ్లు, క్యారెట్, టమోటా, ఆకుకూరలు, క్యాప్సికమ్, చిక్కుడు, కాలిఫ్లవర్, బాదం, పిస్తాలలో ఆంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
ఇక కోడిగుడ్డులోని పచ్చసొన, బీన్స్, చేపలు, రొయ్యలు వంటివి వారానికి రెండుసార్లు తీసుకోవాలి. తృణధాన్యాలను టీనేజ్ పిల్లలకు ఇవ్వడం మరిచిపోకండి. గోధుమలు, రాగి, సజ్జలతో చేసిన వంటకాలను అప్పడప్పుడు తీసుకుంటే టీనేజ్ పిల్లల్లో అనారోగ్య సమస్యలకు అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.