Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

ఐవీఆర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:04 IST)
ఫోటో కర్టెసి: Freepik
తాజాగా అమెరికా పీఠాన్ని అధిష్టించిన డోనాల్డ్ ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇదివరకు ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లి, క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కుకునేవారు. ఈ సమయంలో తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పంపేవారు. అలాంటిది పరిస్థితి తిరగబడిపోయింది.

ట్రంప్ తీసుకువచ్చిన విధానాల వల్ల చదువుతూ బైట పార్ట్ టైం చేసే అవకాశం లేదు. అలా చేస్తే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు దేశంలోకి అక్రమంగా తరలి వచ్చారని ఇక శాశ్వతంగా అమెరికాలోనికి ప్రవేశించకుండా చేసేస్తారు. దీనితో చాలామంది విద్యార్థులు భయపడిపోయి పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. దీనితో వారి నెలవారీ ఖర్చులకు భారతదేశంలో తమ తల్లిదండ్రులను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారంగా వారికి నెలకి కనీసం 70 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
 
అమెరికా వదిలేసి రమ్మంటే ఏడుస్తున్నారు
ఈ పరిస్థితిని గమనించి కొంతమంది తల్లిదండ్రులు ఇక అమెరికాలో వున్నది చాలు... వచ్చేయమంటుంటే అక్కడ జీవనానికి అలవాటు పడిన యువతీయువకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా ఇక్కడే సాధిస్తామంటూ నచ్చచెబుతున్నారు. కానీ తమ బిడ్డల పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనగా వుందని చెబుతున్నారు తల్లిదండ్రులు.
 
ఊళ్లోవాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావ్ నాన్నా...
తన బిడ్డను రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదిస్తానంటే పంపాను, కానీ ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు. ఏదో షాపులో చేస్తున్నాడట... పట్టుకుంటే వీసా క్యాన్సిల్ చేస్తారని చదివి... అమెరికా నుంచి వచ్చేయిరా అని అంటుంటే, ఊళ్లో వాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావు నాన్నా అంటున్నాడని ఓ క్యాబ్ డ్రైవర్ చెబుతున్నారు. ఇలా అమెరికాలో చదువులు కోసం, ఉద్యోగాల కోసం తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా వుంది.

ఐతే ఏప్రియల్ నెల తర్వాత నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. కానీ మార్పు వస్తుందో లేదో కానీ ఈలోపుగా అక్కడి విదేశీ విద్యార్థినీవిద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments