Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ను అడ్డుకునేందుకు తెదేపా అమిత్ షా బీ ప్లాన్... ఏంటది?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (18:00 IST)
ఏపీలో ఎలాగైనా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలన్న చూస్తున్న అధికార పార్టీ తెదేపా, అమిత్ షా రాజకీయ ఎత్తుగడలను ఫాలో అవుతుందా అంటే సంకేతాలు అలానే కనిపిస్తున్నాయి. ఇందుకోసం రాజస్థాన్‌లో అమిత్ షా అమలు చేస్తున్న వ్యూహం అమలు చేయనున్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి వసుంధర రాజేపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, అన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెపుతుండటంతో అధికారం నిలబెట్టుకోవడం కోసం ప్లాన్ అమిత్ షా బీ అమలు చేస్తున్నారని సమాచారం. 
 
ఇందుకోసం జాట్లలో మంచి పట్టు ఉన్న బేనీవాల్‌తో పార్టీ పెట్టించి వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా విజయం అందుకోవచ్చన్నది కమలనాథులు ప్రణాళికలు రచించారంట. ఇప్పుడు అదే రకమైన ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలి అన్నది తెదేపా ఉన్నట్టు రాజకీయ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తున్న మాట. 
 
విభజన తర్వాత రాష్ట్రానికి అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కావాలన్న ఓకే ఒక కారణంతో స్వల్ప తేడాతో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ ఆ అంచనాలు చేరుకోవడంలో కొంతమేర విఫలం అయిదన్న వాదన వినిపిస్తోంది. పూర్తిగా కనీసం నాలుగేళ్లు దాటినా రాజధాని డిజైన్లు కూడా పూర్తి చేయలేకపోయింది. ప్రత్యేక హోదా, కడప ఉక్కు, పెట్రో కారిడార్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులను కేంద్రంలో అధికారం పంచుకొని మరీ సాధించలేక పోయింది. 
 
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తన సొంత సర్వేల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేంద్రం నుంచి బయటకు వచ్చి ఆ తప్పంతా కేంద్రంపైకి నెట్టేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నాలను ప్రతిపక్ష పార్టీ, మేధావులు, బీజేపీ పార్టీలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేయని చంద్రబాబు నాయుడు పరిస్థితి గమనించి జాతీయ స్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఇదే సమయంలో 2014 వరకు కాంగ్రెస్ అండగా ఉన్న ఒక సామాజికవర్గం అదే వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పుణ్యమా అని తొలిసారి టీడీపీకి మద్దతుగా నిలిచారు. 
 
కానీ కాపుల రిజర్వేషన్ విషయంలో టీడీపీ సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో అధికార పార్టీకి దూరం జరిగారు పవన్. పవన్ కళ్యాణ్ ముందుచూపుతో తెలుగుదేశంలో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు రోజురోజుకూ మద్దతు పెరగడంతో ఇప్పుడు రాజస్థాన్‌లో బీజేపీ అనుసరించిన విధానం అమలు చేయాలని నిర్ణయించారట తెలుగుదేశం వ్యూహకర్తలు. ఓటు బ్యాంకు పవన్‌కు వెళితే ఇక తిరిగి పొందటం కష్టమని గ్రహించి ప్లాన్ బీని తెరపైకి తెస్తున్నారంట. 
 
ఇందులో భాగంగా రాష్ట్రంలో గతంలో బాగా మారుమ్రోగిన ఒక ఉన్నతాధికారిని ఎంచుకున్నారు. సుదీర్ఘ కాలం ఉన్న సర్వీసు వదిలి మరీ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. త్వరలోనే ఇతని చేత ఒక పార్టీ పెట్టించి విద్యావంతుల ఓట్లను ప్రతిపక్ష పార్టీకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అంటే కొత్త పార్టీ వెనుక ఎవరు ఉన్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. బాబు గారి ప్లాన్ బీ ఏ మేరకు విజయం సాధిస్తుంది లేక గత నిర్ణయాల వలే బూమ్‌రాంగ్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments