Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోర్లాపడిన అమిత్ షా.. గబుక్కున పట్టుకుని లేపిన నేతలు (Video)

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (16:51 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బోర్లా పడ్డారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఉత్తరభారతంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవైయాలని ఆయన రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మిజోరం పర్యటనకు వెళ్లారు. అక్కడ హెలికాఫ్టర్‌లో నుంచి కిందికి దిగుతుండగా హెలికాఫ్టర్ మెట్లమీది నుంచి జారి బోర్లాపడ్డారు. ఆయన వెంట మరో ఇద్దరు ఉన్నారు. అమిత్ షా కింద పడింది చూసి వారు గబుక్కున పట్టుకుని పైకిలేపారు. ఆ తర్వాత అమిత్ షా తేరుకుని, తన బట్టలకు ఉన్న దుమ్మును దులిపుకుని మళ్లీ తన ప్రచారం కార్యక్రమానికి వెళ్లారు. 
 
అయితే, ఈ ఘటనలో అమిత్ షా‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు యువకులు సెల్ ఫోన్‌లో చిత్రికరించి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది.
 
కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యోపాపం అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మిజోరాంలో ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 28వ తేదీన జరుగనుంది. వెస్ట్ తుయ్‌పూయ్‌ ప్రాంతంలో చక్మా తెగకు చెందిన గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో ఉండటంతో చక్మా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు షా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

అలాగే, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కూడా ఆయన వాహనం దిగపోయి జారిపడగా, పక్కనున్నవారు పట్టుకోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో కూడా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments