Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడే ముద్దంటున్న భార్యలు... వణుకుతున్న భర్తలు

ఓ స్వాతి, ఓ భారతి, ఓ శ్రీవిద్య, ఓ జ్యోతి.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన హంతకురాళ్లు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తల కంటే.. మధ్యలో వచ్చిన ప్రియుడే ముఖ్యమని

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (10:17 IST)
ఓ స్వాతి, ఓ భారతి, ఓ శ్రీవిద్య, ఓ జ్యోతి.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన హంతకురాళ్లు. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తల కంటే.. మధ్యలో వచ్చిన ప్రియుడే ముఖ్యమని భావించారు. ఫలితంగా తమ ప్రేమాయణాలతో జీవిత భాగస్వామిని కడతేర్చారు. 
 
అక్రమ సంబంధంతో భార్యలను వేధించడం, వారికి విడాకులు ఇవ్వడం, ఇంకాస్త ఉన్మాదిగా మారి భార్యను హత్య చేసిన ఘటనలు ఎన్నో చూసివుంటాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పెళ్లికి ముందు ప్రేమో, ఇష్టంలేని పెళ్లి చేశారనో, భర్త వద్ద తనకు కావాల్సిన సుఖం దొరకడం లేదనో... కారణం ఏదైనా కావచ్చు. కాపురాలు సజావుగా సాగుతున్నా, ఉన్నత స్థితిలో ఉన్నా కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. 
 
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఈ సంస్కృతి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గడచిన మూడు నెలల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 9 మంది యువతులు తమ ప్రియుళ్ల కోసం భర్తలను హత్య చేయించారు. పక్కా ప్లాన్ వేసి మరీ దొరికిపోయారు. వీటిల్లో కొన్ని కేసుల వెనుక పోలీసులు సైతం అవాక్కయ్యే నిజాలుండటం గమనార్హం. 
 
నాగర్ కర్నూల్ జిల్లాలో స్వాతి - రాజేష్ ఉదంతం వింటే 'ఔరా' అనిపించక మానదు. ఈ నిజం ఓ క్రైమ్ స్టోరీనే తలపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సుధాకర్ రెడ్డిని, ప్రియుడు రాజేష్ సాయంతో హత్య చేసి, ఆపై రాజేష్‌ను తన భర్త స్థానంలోకి తీసుకురావాలని స్వాతి చేసిన పని సంచలనాన్నే కలిగించింది.
 
ఇదొక్కటే కాదు... సూర్యాపేట సమీపంలో వరుసకు బావ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భారతి అనే యువతి కూడా భర్తను చంపించింది. గత డిసెంబరులో జ్యోతి అనే యువతి, భర్త నాగరాజును హత్య చేయించగా, హత్యకు సహకరించిన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఇవి తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు. ఇక ఏపీ విషయానికి వస్తే, కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇదే తరహా నేరాలు జరిగాయి. శ్రీవిద్య అనే యువతి అక్క భర్తతో సంబంధం పెట్టుకుని, మద్యంలో విషమిచ్చి భర్తను కడతేర్చింది. కర్నూలులో ప్రియుడి సాయంతో భర్త తలపై బండరాయితో మోదింది మరో మహిళ. కడపలో కిరాయి హంతకులను పెట్టి మరీ భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. 
 
తాత్కాలిక సుఖం, విలాసవంతమైన జీవితం, పెళ్లికి ముందు ప్రేమాయణం, పెళ్లి నాటి ప్రమాణాలు, సాంఘిక నిబంధనలను పిల్లల భవిష్యత్తునూ నాశనం చేస్తున్నాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. మారుతున్న సమాజం, సినిమాలు, సీరియళ్ల ప్రభావం, బలవంతపు పెళ్లిళ్లతో పాటు అశ్లీల సాహిత్యం, విశృంఖల లైంగిక వాంఛలు ఇందుకు కారణమని అంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం