Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాయ్‌లెట్లు కట్టించలేరా.. అయితే మీ భార్యల్నిఅమ్మేయండి.. కలెక్టర్ వ్యాఖ్యతో కలవరం

టాయిలెట్లు కట్టించడానికి డబ్బులు లేకపోతే మీ భార్యలను అమ్మేయమంటూ బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్య తీవ్రంగా దుమారం లేపింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కన్వల్ తనూజ్ సద

టాయ్‌లెట్లు కట్టించలేరా.. అయితే మీ భార్యల్నిఅమ్మేయండి.. కలెక్టర్ వ్యాఖ్యతో కలవరం
హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (07:55 IST)
టాయిలెట్లు కట్టించడానికి డబ్బులు లేకపోతే మీ భార్యలను అమ్మేయమంటూ బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్య తీవ్రంగా దుమారం లేపింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కన్వల్ తనూజ్ సదుద్దేశంతోనే చేసిన వ్యాఖ్య వీడియోరూపంలో వైరల్ అయి సంచలనానికి దారితీసింది.  గ్రామంలోని వందలాది ప్రజలకు టాయ్ లెట్లు కట్టుకోవాలని కలెక్టర్ సందేశమిస్తుండగా ప్రజల్లో ఒకరు తనవద్ద టాయెలెట్ కట్టడానికి డబ్బులు లేవని కేకలేశాడు. డబ్బులు లేవా అయితే మీ వెళ్లి నా భార్యను అమ్మేయ్. నీ మనస్తత్వం ఇదే అయితే భార్యను అమ్మేయ్ సరిపోతుంది అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు అదికంగా ఉన్న ఆ గ్రామంలో స్వచ్చ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్న సందర్భంగా ఈ సంభాషణ జరిగింది. 
 
దేశంలోని గ్రామాల్లో చాలామంది మహిళలు ఇళ్లలో మరుగుదొడ్లు లేక బహిర్భూమి వెళ్లిన సమయంలోనే అత్యాచారాలకు గురయ్యారని, అందుకే మహిళల గౌరవం కాపాడాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మరుగు దొడ్లు కట్టుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 
 
మీకు వీలయితే మీ భార్యలను అమ్ముకోండి. మీరెంత పేదవాళ్లు. అలాంటివారు చేతులెత్తి మీ భార్య విలువ రూ. 12 వేలకంటే తక్కువ అని చెప్పండి చూద్దాం అని కలెక్టర్ ప్రశ్నించారు. నా భార్య గౌరవాన్ని తీసేసుకుని నాకు 12 వేల రూపాయలు డబ్బులు ఇవ్వండని ఏ మనిషేనా చెప్పగలడా.. చెప్పండి చూద్దాం అంటూ కలెక్టర్ సవాలు చేశారు. 
 
తర్వాత తన ప్రసంగంలోని కొంత భాగం వీడియో రూపంలో దుమారం లేపడంతో దురుద్దేశంతోటే తన వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే తను మాట్లాడిన పూర్తి పాఠం వీడియోలో చూసి తర్వాత మాట్లాడండి అంటూ కలెక్టర్ మీడియాపై ధ్వజమెత్తారు. 
 
ప్రతి పంచాయితీలోనూ టాయ్లెట్లు కట్టుకోవాలని  తాము క్యాంపులు నిర్వహిస్తున్నామని, చాలామంది ప్రజలు తమ వద్ద డబ్బులు లేవని, అడ్వాన్సుగా ఇప్పించాలని అడుగుతున్నారని కలెక్టర్ వివరించారు. మరుగుదొడ్లు ఎంత అవసరం అనే విషయాన్నే తాను నొక్కి చెప్పానని, అభ్యంతరకరమైన విషయం ఏదీ తాను మాట్లాడలేదని కలెక్టర్ సమర్థించుకున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్ సెల్వం గ్రూపులో లుకలుకలు.. ఎమ్మెల్యే జంప్.. దినకరన్ దెబ్బకు పళని స్వామి అలర్ట్