Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్ సెల్వం గ్రూపులో లుకలుకలు.. ఎమ్మెల్యే జంప్.. దినకరన్ దెబ్బకు పళని స్వామి అలర్ట్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలోకి వచ్చిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి మరోసారి జంప్ జిలానీ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి నేపథ్యంలో అన్నాడీఎంకే నిలువుగా చేరిపోగా చిన్న బృదానికి నాయకుడిగా మిగిలిపోయిన పన్నీర్ స్వామ శిబిరాన

Advertiesment
పన్నీర్ సెల్వం గ్రూపులో లుకలుకలు.. ఎమ్మెల్యే జంప్.. దినకరన్ దెబ్బకు పళని స్వామి అలర్ట్
హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (06:48 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలోకి వచ్చిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి మరోసారి జంప్ జిలానీ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మృతి నేపథ్యంలో అన్నాడీఎంకే నిలువుగా చేరిపోగా చిన్న బృదానికి నాయకుడిగా మిగిలిపోయిన పన్నీర్ స్వామ శిబిరాన్ని ఖాళీ చేసే యత్నాలు ఊపందకున్నాయి. దీంట్లో భాగంగానే సీఎం పళని స్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరంలో పన్నీర్ గ్రూపులోని  ఎమ్మెల్యే ఆరుకుట్టి చేరారు. మరికొందరు ఆయన బాటలో పయనిస్తారనే సమాచారంతో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
 
సీ ఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట 122 మంది, మాజీ సీఎం పన్నీ రు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం శిబిరంలో ఇటీవల అసంతృప్తి రాజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సైతం పన్నీరుకు తగ్గుతుండడంతో ఆ శిబిరంలోని నేతలు, ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. అసంతృప్తిని బయటపెడుతూ గౌండం పాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి ఆ శిబిరం నుంచి బయటకు అడుగువేశారు. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని గతంలో ప్రకటించినప్పుడు అందులో అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు ఆ శిబిరం నుంచి బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ దృష్ట్యా, ఇక, ఆ శిబిరం నుంచి జంప్‌జిలానీల సంఖ్య ఇక పెరగడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి.
 
ఆరుకుట్టి బాటలో మరికొందరు అమ్మ శిబిరంలోకి వెళ్లే అవకాశాలున్న సమాచారంతో పన్నీరు సెల్వం మేల్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంట కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. 12మందిలో మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజ్‌ తటస్థంగా ఉండగా, ఆరుకుట్టి హ్యాండిచ్చారు. ఇక, పన్నీరుతో పాటుగా సెమ్మలై, శరవణన్, మనోహరన్, మాణిక్యం, షణ్ముగనాథన్, చిన్నరాజ్, అరుణ్‌కుమార్, పాండియరాజన్, మనోరంజితం మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు అమ్మ గొడుగు నీడకు చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆరుకుట్టికి అమ్మ శిబిరంలో ఇచ్చే విలువ, ప్రాధాన్యత మేరకు ఈ నలుగురు జంప్‌ జిలానీ కావడం తథ్యం.
 
ఆరుకుట్టి జంప్‌ గురించి మీడియా సంధించిన ప్రశ్నకు, ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు..పోతే పోనీ.. అంటూ పన్నీరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆగస్టు తర్వాత అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ రూపంలో ఏదేని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉండబట్టే, బలాన్ని పెంచుకునే విధంగా పన్నీరు శిబిరాన్ని పళని గురిపెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైదానంలో ఓడి విలపించారు.. కోట్లమంది హృదయాలను గెల్చుకున్నారు.. మీ స్ఫూర్తిని మర్చిపోలేం మిథాలీ అండ్ టీమ్