Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నాలతో ఆశలు నెరవేర్చుకుందాం...

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడల్లా, మనకు ఓ ప్రేరణనిస్తుంటుంది. నిత్యం మారుతూ వెళ్లే ఈ కాల ప్రవాహంలో సంవత్సరాలు మారడం అనేది పెద్ద విషయమే కాదు, అది ఓ చిన్న బిందువు లాంటిది. ఐతే ఆ బిందువే మార్పుక

ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నాలతో ఆశలు నెరవేర్చుకుందాం...
, గురువారం, 28 డిశెంబరు 2017 (21:32 IST)
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడల్లా, మనకు ఓ ప్రేరణనిస్తుంటుంది. నిత్యం మారుతూ వెళ్లే ఈ కాల ప్రవాహంలో సంవత్సరాలు మారడం అనేది పెద్ద విషయమే కాదు, అది ఓ చిన్న బిందువు లాంటిది. ఐతే ఆ బిందువే మార్పుకు శ్రీకారం చుడుతుంది. ఇది నిరాటంకంగానూ, నిత్యం జరిగే ప్రక్రియే. మనం గోడకు నూతన సంవత్సర క్యాలెండరును వేలాడదీసే ముందుగా, ఎన్నో విషయాలు, గణాంకాలు మారిపోయిన సంగతి మనకు బోధపడుతుంది.

అందుకే ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనకు మనం జాగృతులం కావాలి, భవిష్యత్ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఇలా ఆలోచన చేస్తూ మనకు మనం గడిచిన కాలాన్ని మరింత దగ్గరగా, నిశితంగా పరిశీలించడం మనకేమీ హానికరం కాదు, కానీ మారుతున్న కాలంలో మన జీవితాలు, ఆసక్తికరమైన అంశాలతో పాటు ఇంకా మనపై ప్రభావం చూపిన అంశాలు గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోవడం ముదావహం.
 
ప్రపంచంలోకి ఒక్కసారి తొంగిచూస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే చర్చ జరిగింది. వైట్ హౌస్ అధ్యక్ష పీఠంపైన ట్రంప్ కూర్చోబెట్టడం అనేది ఇబ్బందికరమైన, తిరోగమనమైనదిగా అమెరికాలోని చాలామంది భావించారు. ఓ రియల్ ఎస్టేట్ బిలియనీర్ అమెరికా అధ్యక్షుడిగా రావడంతో అన్నివిషయాల్లో వెనుకబడుతోందనీ, ఆయన అనాగరిక-ఇరుకైన మనస్తత్వం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని భావించారు. ఒబామా కాలంతో పోల్చుకున్నవారు ట్రంప్ అధ్యక్షుడిగా రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.   
 
కానీ వీటన్నిటినీ ట్రంప్ విస్మరించడం కష్టంగానే అనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ఈయన కాలంలో ప్రపంచానికి మాత్రం మంచో లేదంటే చెడో జరగడం ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆయన జ్యూ స్టేట్ రాజధానిగా జెరూసలేం అని ప్రకటించడంపై ఎవరూ అభ్యంతరకం చెప్పకపోవచ్చు, అలాగే ఇంటర్నెట్ ఇండిపెండెన్సుకు ముగింపు పలకేందుకు తీసుకున్న నిర్ణయంపైన పరిణామాలు చాలా ప్రభావం చూపవచ్చు. ఇలాంటి మార్పులను 2018లోనూ మనం చూడాల్సి వుంటుంది. 
 
ఇక తూర్పువైపుకు చూస్తే, చైనా బలమైన నాయకుడు, మావో చైర్మన్ అధిపతి అయిన క్జి జిన్‌పింగ్ ప్రపంచంలో చైనాను ఏకపక్షంగా తీసుకెళుతున్నారు. ఆయన రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించడంతో బలమైన వ్యక్తిగా ఎదగడటంతో పాటు భారతదేశంపై తన ప్రభావాన్ని చూపుతున్నారు. ఫలితంగా అమెరికాతో భారతదేశం మైత్రి బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవాల్సిన అవసరం వచ్చింది. పాకిస్తాన్-చైనా మైత్రీ బంధం ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. ఇదిలావుంటే, రోహింగ్యా సమస్య ఒకవైపు, బిట్ కాయిన్ మరోవైపు, పనామా పేపర్స్ ఇంకోవైపు యూరప్ లో ఆర్థిక తిరోగమనం వంటివన్నీ చూస్తున్నాం. అవన్నీ అలావుంటే భారతదేశ ఇమ్మింగ్రెంట్ కుమారుడు, లియో వరద్కర్, ఐర్లాండ్ దేశానికి ప్రధానమంత్రి అయినవారిలో అత్యంత పిన్నవయస్కుడుగా చరిత్ర సృష్టించారు.
 
ఇక భారతదేశం విషయానికి వస్తే, నవంబరు 8, 2016న పెద్దనోట్ల రద్దును ప్రకటించారు. ఆయన నిర్ణయం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత, పరిస్థితులు మెల్లగా చక్కబడ్డాయని చెపుతున్నప్పటికీ, ఇంకా దానిని రూఢి చేయాల్సి వుంది. ఏటీఎంల ముందు పెద్దపెద్ద క్యూలు కనబడటంలేదు కానీ నోట్ల కొరత మాత్రం చర్చనీయాంశమైంది. ఇది ఇలా సాగుతుండగానే జిఎస్టి పేరుతో మరో బాంబు పడింది ప్రజల నెత్తిపైన. దీన్ని జూలై 1, 2017న అమలుపరిచారు కానీ ఇంకా సమీక్షలు అవసరమవుతూనే వున్నాయి. 
 
అలాగే మే 1న వీఐపి వాహనాలపైన వుండే ఎర్ర బుగ్గను నిషేధించారు, 22 ఆగస్టు 2017న ట్రిపుల్ తలాక్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ఇది కనుక చట్టంగా మారితే, ముస్లిం మహిళల్లో చాలామంది ట్రిపుల్ తలాక్ నుంచి స్వేచ్చను పొందుతారు. అలా ఈ ఏడాది మనల్ని పలు సమస్యలతోనూ, ఎన్నో విజయాలతోనూ వదిలివెళ్లిపోతోంది. మన విజయాలను తరచి చూసుకుంటే క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్ - జిఎస్ఎల్వి మార్క్ 3ని విజయవంతంగా ప్రయోగించాం. అదేసమయంలో ముంబైలో ఆశా సహానీ వ్యధనూ చూశాం.
 
ఇక ఇప్పుడు మన ప్రయత్నాలన్నీ మన ఆశలను నెరవేర్చుకునే దిశగా, అదీ ఈ 2018 నూతన సంవత్సర ప్రారంభంతో క్రమంగా పెరిగిపోతున్న మత ఛాందసం, ప్రతీకారేచ్చ, శత్రుత్వాలు రూపుమాసిపోవాలని కోరుకుందాం. సమాజంలో పరస్పర సామరస్యంతో మెలగాలనీ, అనుకున్నవన్నీ ఈ 2018లో నెరవేరాలనీ, మన ఆశలన్నీ ఫలప్రదం కావాలని ఆకాంక్షిద్దాం. 
 
2018 నూతన సంవత్సర సందర్భంగా మీకివే శుభాకాంక్షలు
- మీ జయదీప్ కార్నిక్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటి నొప్పులతో అలా నడుం వాల్చితే.. భర్త తలాక్ చెప్పేశాడు..