Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలు

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..
, శనివారం, 11 మార్చి 2017 (17:42 IST)
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్ తరపున పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగడంతో.. అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే.. సెమీఫైనల్లో వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. క్వార్టర్ ఫైనల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. 
 
కానీ పీవీ సింధును క్వార్టర్ ఫైనల్‌లో 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ వన్‌, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్‌ ఓడించింది. అలాగే మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ను 14-21, 10-21 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్‌ జి హ్యున్‌ ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో తప్పిదాలతో మ్యాచ్‌లను కోల్పోయారు. ఫలితంగా క్వార్టర్స్‌తోనే ఇంటి ముఖం పట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ అలసిపోయాడు.. అభిమానితో నో సెల్ఫీ.. బ్యాగ్ పడిపోయినా కారు దూసుకెళ్లిందా?