Webdunia - Bharat's app for daily news and videos

Install App

e-RUPI అంటే ఏమిటి? దాన్ని ఎలా తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (19:25 IST)
డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సరికొత్త ఆవిష్కరణకు సోమవారం శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పుకు నడుంబిగించారు. ఇందులోభాగంగా, ఈ-రుపీని అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక ఎల‌క్ట్రానిక్ ఓచ‌ర్‌లా ప‌నిచేస్తుంది. దీన్ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ డిపార్ట్ మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అసలు ఈ-రుపీ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? దీని ద్వారా చెల్లింపులు చేయాలంటే ఏం చేయాలి? అనే అంశాలను పరిశీలిద్దాం. 
 
ఈ- రూపీ అనేది న‌గ‌దు ర‌హిత డిజిట‌ల్ పేమెంట్ మీడియం. ఇది ఒక ఎల‌క్ట్రానిక్ ఓచ‌ర్ రూపంలో లభ్యమవుతుంది. దీన్ని సంబంధిత ల‌బ్ధిదారుల‌కు ఎస్ఎంఎస్ రూపంలో కానీ.. క్యూఆర్ కోడ్ రూపంలో ప్రీపేడ్ గిఫ్ట్ ఓచ‌ర్‌గా పంపిస్తారు. దీన్ని ఈ-రూపేను యాక్సెస్ చేసుకునే సెంట‌ర్ల వ‌ద్ద పేమెంట్‌గా చెల్లించ‌వ‌చ్చు. 
 
ఈ- రూపీ కోసం ఎటువంటి క్రెడిట్ కార్డు కానీ.. డెబిట్ కార్డు కానీ అవ‌స‌రం లేదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి థ‌ర్డ్ పార్టీ వాలెట్ యాప్స్ ఏవీ అవ‌స‌రం లేదు. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అవ‌స‌రం లేదు. మొబైల్ బ్యాంకింగ్ అవ‌స‌రం లేదు. కేవ‌లం మీద ద‌గ్గ‌ర ఈ-రూపీకి సంబంధించిన ఎస్ఎంఎస్ కానీ.. క్యూఆర్ కోడ్ కానీ ఉంటే చాలు. ఎక్క‌డైనా చెల్లింపులు చేసుకోవ‌చ్చు.
 
అయితే, ప్రస్తుతం కొన్ని బ్యాంకులు.. ఎన్పీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ-రూపీ ఓచ‌ర్‌ను అందిస్తాయి. పార్ట‌న‌ర్ బ్యాంకుల‌ను ముందు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు అప్రోచ్ అవుతారు. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్‌ బ్యాంకుల ద్వారా త‌మ వినియోగ‌దారులకు వోచ‌ర్స్‌ను అందిస్తారు. 
 
వోచ‌ర్స్ ప్ర‌కారం అమౌంట్ ఎంత వాడుకుంటే.. అంత అమౌంట్‌‍‌ను తిరిగి వినియోగ‌దారులు సంబంధిత మ‌నీ లెండ‌ర్స్‌ను క‌ట్టాల్సి ఉంటుంది. క‌స్ట‌మ‌ర్ ఫోన్ నెంబ‌ర్‌కు వ‌చ్చే క్యూఆర్ కోడ్‌తో ఎక్క‌డైనా ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేసే అవ‌కాశం ఉంటుంది.
 
అయితే, ఈ తరహా పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం వెనుక న‌గ‌దు ర‌హిత చెల్లింపుల్లో లీకేజీని అరిక‌ట్ట‌డం అనేది ప్రస్తుతం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అలాగే పార‌ద‌ర్శ‌కంగా న‌గ‌దు ర‌హిత చెల్లింపులు ఉండాల‌న్నారు. 
 
అలాగే ప్ర‌భుత్వాలు ప్రారంభించే సంక్షేమ ప‌థ‌కాలు అస‌లైన ల‌బ్ధిదారుల‌కు మాత్ర‌మే చేరాల‌ని ప‌లు ప‌థ‌కాల ద్వారా ప్ర‌యోజ‌నాలు పొందే ల‌బ్ధిదారుల‌కు ఈ-రూపీ ద్వారా చెల్లింపులు చేయ‌నున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments