Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణుమాధ‌వ్ హాస్ప‌ిట‌ల్ బిల్లు క‌ట్టిన మంత్రి, ఇంత‌కీ ఎవ‌రా మంత్రి?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (13:25 IST)
ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు వేణుమాధవ్ అనారోగ్యంతో  మ‌ర‌ణించిన‌ సంగతి తెలిసిందే.  సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకోగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. అంతేకాకుండా... వేణుమాధవ్ ఆస్పత్రిలో ఉన్నంతవరకూ అయిన బిల్లును మంత్రి తలసానే చెల్లించారు. అలాగే అంత్యక్రియలకు కావాల్సిన డబ్బు మొత్తం తానే సాయం చేస్తానని చెప్పి 2 లక్షలు సాయం ప్రకటించినట్లు సమాచారం. 
 
ఈ సందర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ.... వేణుమాధవ్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఇంత చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరం. వేణుమాధవ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ వేణుమాధవ్ నాకు తెలుసు. ఆయన ఎక్కడున్నా అందర్నీ నవ్వించేవాడు. 
 
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని టాలెంట్‌తో ఈ స్థాయికి వ‌చ్చాడు. సుమారు 600 చిత్రాల్లో నటించి.. నంది అవార్డులు దక్కించుకున్నాడు అని చెప్పి ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments