కేసీఆర్ హ్యాంగోవర్‌లో వున్నారా? ప్రధాని రేసుకు రెడీ.. ఛాన్స్ వస్తే?

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (18:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా హ్యాంగోవర్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. రేవంత్‌ని కాంగ్రెస్‌ నుంచి గెంటేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా వుందని కామెంట్లు చేస్తున్న కేసీఆర్ ప్రస్తుతం తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు.
 
మీడియాను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ "నేను ప్రధాని రేసులో ఎందుకు ఉండను? అవకాశం వస్తే దాన్ని స్వీకరించడానికి నేను సంతోషిస్తాను. ఆ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోరు." అని కేసీఆర్ అన్నారు. తనకు ఇంకా జాతీయ రాజకీయాల కలలు ఉన్నాయని, తనకు వచ్చిన ఏ అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
 
కేసీఆర్ విశ్వాసాన్ని, ఉద్దేశాన్ని బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు స్వాగతిస్తున్నారు. విపక్షాలు మాత్రం ఎన్నికల్లో ఓడినా.., ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడంలో కేసీఆర్ తెగువ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
 
మొత్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ 1-2 సీట్లకు మించి గెలువదని పలు సర్వేలు చెబుతున్న తరుణంలో కేసీఆర్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌‌ను లాంచ్ చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

Youth: కిరణ్ అబ్బవరం ఆవిష్కరించిన యూత్ మూవీ ఫస్ట్ లుక్

Peddi in Dolby : డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో పెద్ది రిలీజ్ కు సిద్ధం

Rashi khanna: రెండువేల మందితో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది

Naga Chaitanya: వృషకర్మ స్టన్స్ కోసం నాగ చైతన్య కొత్త BTS స్టిల్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

తర్వాతి కథనం
Show comments