Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్‌కు 20 ఇయర్స్.. 60 రోజుల పాటు ఎలా జరిగిందంటే?

Webdunia
గురువారం, 25 జులై 2019 (13:01 IST)
కార్గిల్ యుద్ధానికి 20 సంవత్సరాలైంది. పాకిస్థాన్ ప్రేరేపిత చర్యల వల్ల... కార్గిల్ యద్ధం జరగక తప్పలేదు. 1999 మే 3 నుంచీ జులై 26 మధ్య కార్గిల్ జిల్లాలో... వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిందీ యుద్ధం. దీనికి భారత సైన్యం పెట్టుకున్న ఆపరేషన్ విజయ్ అంటూ కోడ్ నేమ్ పెట్టుకుంది. కార్గిల్ సెక్టార్‌లో పాక్ చొరబాటుదారుల్నీ, సైన్యాన్నీ తిప్పికొట్టడమే ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం. 
 
అప్పటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగకూడదని ఎదురు చూసినా.. పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు తెరవేయకపోవడంతో.. యుద్ధం అనివార్యమైంది. పర్వత ప్రాంతాలు, ఎముకలు వణికే చలిలో ఈ కార్గిల్ యుద్ధం జరిగింది. దాదాపు 60 రోజులపాటూ రెండు దేశాల మధ్యా యుద్ధం జరిగింది. రెండువైపులా ఎంతో మంది సైనికులు ప్రాణాలు విడిచారు. 
 
భారత భూభాగంలోకి ఎంటరైన పాక్ సైన్యాన్ని తిప్పికొట్టి... మన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్... కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. అది జులై 26, 1999. దాన్ని కార్గిల్ విజయ్ దివస్‌గా ఏటా జరుపుకుంటున్నాం. 
 
కార్గిల్ యుద్ధం సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో జరిగింది. అక్కడ సుమారు 1700 మంది పాకిస్తాన్ జవాన్లు భారత సరిహద్దుల్లో దాదాపు 8-9 కిలోమీటర్లు లోపలికి చొరబడ్డారు. ఈ మొత్తం ఆపరేషన్లో 527 మంది భారత జవాన్లు మృతిచెందగా, 1363 మంది జవాన్లు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments