Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య... నిజం రాస్తే పాయింట్ బ్లాంక్ మర్డర్లే...

బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య. తుపాకులతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. వీరి చేసింది నిజాలను నిర్భయంగా రాయడమే. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వె

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (18:07 IST)
బెంగళూరులో ఒకే టైపు హత్యలు. అప్పుడు ప్రముఖ రచయిత కల్బుర్గీ, ఇప్పుడు సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య. తుపాకులతో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. వీరి చేసింది నిజాలను నిర్భయంగా రాయడమే. అదే వారి ప్రాణాల మీదికి తెచ్చింది. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరులో గౌరీ లంకేష్ తన ఇంటి గేటు తీస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి ఆమెపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపారు. తూటాలు ఆమె మెడ, ఛాతీ భాగాల్లో దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. 
 
అయితే, గౌరీ లంకేశ్ ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు పోలీసుల ముందు సవాలుగా నిలిచింది. ఆమె తన ఇంట్లో అమర్చుకున్న సీసీటీవీలకు ఓ పాస్ వర్డ్‌ను పెట్టుకుని ఉండటమే ఇందుకు కారణం. నిందితుల వివరాలు ఈ కెమెరాల్లో రికార్డు అయి ఉంటాయని స్పష్టం చేసిన పోలీసులు, ఇప్పుడా పాస్ వర్డ్‌ను ఛేదించే పనిలో పడ్డారు. 
 
ఆ పాస్‌వర్డ్ ఆమెకు మాత్రమే తెలుసునని వెల్లడించిన సిట్ అధికారులు, రాష్ట్ర సైబర్ నిపుణులు వీడియోలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తయితే, ఎంతమంది హత్యలో పాల్గొన్నారన్న విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ విచారణకు అత్యంత కీలకమని తెలిపారు.  
 
కాగా, ఈ హత్యను పలువురు నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం హిందుత్వ రాజకీయాలను విమర్శించినందుకే ఈమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మనీష్ సిసోడియాలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. "ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే.." వ్యాఖ్యానించారు. 
 
అలాగే, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... "ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య వార్త విని షాకయ్యాను. ఈ దారుణాన్ని ఖండించడానికి మాటలు కూడా రావడం లేదు. వాస్తవానికి ఇది ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. ఆమె మరణంతో కర్ణాటక ఓ బలమైన ప్రగతిశీల గళాన్ని కోల్పోయింది. నేను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను.." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'బెంగళూరు సహా పలుచోట్ల ఎందుకింత దారుణాలు చోటుచేసుకుంటున్నాయి? దీనిపై యడ్యూరప్ప నిరవధిక సత్యాగ్రహాన్ని చేపట్టాలి. లేకుంటే బెంగళూరు 1930ల నాటి చికాగో నగరంలా మారుతుంది...' అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments