పవన్ నన్ను అడగలేదే.. మంత్రి పదవి ఇచ్చే పార్టీలో చేరుతా: అలీ

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:02 IST)
ప్రముఖ కమెడియన్, నోటి దూలతో వివాదాల్లో చిక్కుకునే అలీ ప్రస్తుతం రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం అలీ జనసేన చీఫ్ పవన్‌ను కలవడం, ఆపై వైకాపా చీఫ్ జగన్‌ను కలవడమే. ఇలా వరుస భేటీలతో ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న అలీ.. తాజాగా తన రాజకీయ అరంగేట్రంపై నోరు విప్పారు.
 
ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తుంటో ఆ పార్టీలో చేరుతానని అలీ స్పష్టం చేశారు. తాను టీడీపీలో వున్నట్లు పవన్‌కు తెలుసునని.. గతంలో ఎన్నికల సందర్భంగా టిక్కెట్ ఇస్తున్నారా.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా అని పవన్ అడిగారని గుర్తు చేసుకున్నాడు. 
 
అలాగే జనసేనలో చేరే అంశంపై అలీ మాట్లాడుతూ.. జనసేనలోకి రమ్మని పవన్ కల్యాణ్ పిలవలేదు. తాను వెళ్లలేదన్నారు. పవన్ పార్టీ పెట్టే విషయం తనకు ముందే తెలుసు. కానీ పవన్ ఈ విషయాన్ని నేరుగా తనతో ప్రస్తావించలేదు. పవన్ పార్టీ పెట్టాక ఆయన్ను కలవలేదు.
 
జనసేన తరపున పనిచేయమని ఆయన తనను అడగలేదు. ఆయన వల్ల తనకు ఇబ్బంది కలుగుతందనే ఆలోచనతో పవన్ తనను అడిగివుండరు. తన సొంత మనుషులకు పవన్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టరని.. అందుకే తాను వెళ్లలేదని అలీ జవాబిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments