టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్సీ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీ పరంగా టాక్ ఉన్న వీరు ఇప్పుడు రకరకాల వార్తలతో అంతర్గత కలహాలతో, అర్థంకాని మనస్పర్థలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 మంది హీరోలు ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో ఈవెంట్ జరిగినా మిగిలిన అందరూ అక్కడికి వెళ్ళి సందడి చేస్తారు.
స్టేజ్ పై స్పీచ్‌లు దంచుతారు. అభిమానులతో విజిల్స్ వేయిస్తారు. ఆ ఈవెంట్ అయ్యాక మాత్రం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఎన్నో ఈవెంట్స్ ఇప్పటివరకు జరిగాయి. ఎందుకంటే భయమేనంటున్నారు సినీ విశ్లేషకులు. స్టేజ్ మీద అయితే ఏం మాట్లాడినా ఫర్వాలేదు. అభిమానులు విని వెళ్ళిపోతారు కనుక.
కానీ మీడియాతో మాట్లాడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని, వారు ఏ ప్రశ్న వేస్తారో..దానికి ఎలా రియాక్టవ్వాలోనన్నది మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యుల భయమంటున్నారు సినీవిశ్లేషకులు. మెగా ఫ్యామిలీలో నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం..జనసేన పార్టీ పెట్టి ఇష్టమొచ్చినట్లు పవన్ మాట్లాడుతుండటంతో మెగా ఫ్యామిలీ సభ్యుల్లో భయం పట్టుకుందట.
మరోవైపు నాగబాబు సొంతంగా యు ట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదేదో మాట్లాడేస్తున్నారు. అయితే మీడియా ముందుకు మాత్రం ఆయన అస్సలు రావడం లేదు. కారణం మీడియా ఏం అడుగుతుందోనన్న భయం. ఇదంతా ఎన్నికల వరకేనంటున్నారు సినీ విశ్లేషకులు.