Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుడిలా వచ్చి ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (09:21 IST)
తనను నమ్మించి, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఇపుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడనే కోపంతో ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బానుపురికి చెందిన దమ్రుధర్‌ బాఘేల్‌ (25) అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. 
 
కొంతకాలం సాఫీగా జరిగిన వీరి ప్రేమలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు పొడచూపాయి. దీంతో బాఘేల్‌.. ప్రియురాలిని దూరం పెట్టాడు. ఈ క్రమంలోనే మరో యువతితో పెళ్లి ఖాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు... కోపంతో ప్రియుడిని చంపాలని నిశ్చయించుకుంది. పెళ్లి జరిగే సమయంలో అబ్బాయిలా వేషం వేసుకుని యాసిడ్‌ సీసాతో మండపానికి వచ్చింది. 
 
ఆ సీసాను అతనిపై విసరడంతో వధూవరులకు గాయాలయ్యాయి. మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలోనే కరెంట్‌ పోవటంతో నిందితురాలు అక్కడి నుంచి పరారైంది. పోలీసులు మండపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి మారువేషంలో వచ్చింది అమ్మాయిగా గుర్తించారు. దాడి చేసిన మహిళ వరుడి మాజీ ప్రియురాలిగా నిర్ధారించి, ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments