మాజీ ప్రియుడికి పెళ్లి జరుగుతుండగా.. మాజీ ప్రియుడి పెళ్లి సందర్భంగా ఛత్తీస్‌గఢ్ యువతి అతనిపై యాసిడ్ పోసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులు మరో యువతితో పెళ్లి సందర్భంగా మాజీ ప్రియుడిపై దాడి చేసిన 23 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 19న ఛోటే అమాబల్ గ్రామంలో వరుడు దమ్రుధర్ బాఘేల్ (25) 19 ఏళ్ల యువతితో వివాహం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
యాసిడ్ దాడిలో వరుడు, వధువు, 10 మంది పెళ్లికి వచ్చిన అతిథులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో అమర్చిన 12 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన తర్వాత దాడి సమయంలో తానెవరో తెలియకూడదని యువతి పురుషుడి వేషంలో వచ్చింది. అయితే ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొన్నేళ్లుగా దమ్రుధర్ బాఘేల్‌తో సంబంధం ఉందని, అతను తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని నిందితురాలు పోలీసులకు తెలిపింది. అయితే మరో యువతితో పెళ్లి నిశ్చయించుకుని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని పెళ్లి విషయం తెలిసిన వెంటనే ఆమె దమ్రుధర్‌కి ఫోన్ చేసింది.
అయితే కానీ అతను ఆమె కాల్స్ ఎత్తడం మానేశాడు. ఆ తర్వాత టీవీలో 'క్రైమ్ పెట్రోల్' చూస్తుండగా, ప్రియుడిపై యాసిడ్ దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆపై మిరప పొలంలో యాసిడ్ దొంగిలించినట్లు చెప్పుకొచ్చింది.