Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. వరుడిపై యాసిడ్ పోసిన యువతి

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (09:14 IST)
మాజీ ప్రియుడికి పెళ్లి జరుగుతుండగా.. మాజీ ప్రియుడి పెళ్లి సందర్భంగా ఛత్తీస్‌గఢ్ యువతి అతనిపై యాసిడ్ పోసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.  
 
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులు మరో యువతితో పెళ్లి సందర్భంగా మాజీ ప్రియుడిపై దాడి చేసిన 23 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 19న ఛోటే అమాబల్ గ్రామంలో వరుడు దమ్రుధర్ బాఘేల్ (25) 19 ఏళ్ల యువతితో వివాహం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
యాసిడ్ దాడిలో వరుడు, వధువు, 10 మంది పెళ్లికి వచ్చిన అతిథులకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో అమర్చిన 12 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన తర్వాత దాడి సమయంలో తానెవరో తెలియకూడదని యువతి పురుషుడి వేషంలో వచ్చింది. అయితే ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
గత కొన్నేళ్లుగా దమ్రుధర్ బాఘేల్‌తో సంబంధం ఉందని, అతను తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని నిందితురాలు పోలీసులకు తెలిపింది. అయితే మరో యువతితో పెళ్లి నిశ్చయించుకుని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని పెళ్లి విషయం తెలిసిన వెంటనే ఆమె దమ్రుధర్‌కి ఫోన్ చేసింది. 
 
అయితే కానీ అతను ఆమె కాల్స్ ఎత్తడం మానేశాడు. ఆ తర్వాత టీవీలో 'క్రైమ్ పెట్రోల్' చూస్తుండగా, ప్రియుడిపై యాసిడ్‌ దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆపై మిరప పొలంలో యాసిడ్ దొంగిలించినట్లు చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments