Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (12:45 IST)
ఒకవైపు కట్టుకున్న భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు, ఒక రోజు సెలవు అడిగినందుకు ఉద్యోగిపై యాజమాన్యం కన్నెర్రజేసి, ఆమెను ప్రిన్సిపాల్ ఉద్యోగం నుంచి తప్పించారు. కొద్ది రోజులకు ఏకంగా ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఇలా వరుస కష్టాలు వెన్నంటడంతో ఆ మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన కడప జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కడప జిల్లాకు చెందిన ముంగర సురేంద్రనాథ్, రత్నాకరం శ్రీవాణి (45) అనే దంపతులు గత కొంతకాలంగా స్థానిక శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్నారు. సురేంద్రనాథ్ కోడూరు ఎల్ఐసీ ఆఫీసులో అసిస్టెంట్ అడ్మినస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ప్రతి రోజూ తిరుపతి నుంచి డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. శ్రీవాణి రెండేళ్లుగా నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తుంది. అయితే, కాలేయ సమస్య కారణంగా తన భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. 
 
ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఒక రోజు సెలవు కావాలని పాఠశాల యాజమాన్యాన్ని శ్రీవాణి కోరింది. అయితే, పరీక్షల సమయంలో సెలవులు ఇవ్వలేమని నిరాకరించి, ఆమె స్థానంలో మరొకరిని ప్రిన్సిపాల్‌గా నియమించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెను ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తీవ్ర మనస్థాపానికు గురైన ఆ మహిళ... మంగళవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతులకు విదేశాలల్లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments