Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఐవీఆర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (13:21 IST)
మూత్ర విసర్జనకు చెట్ల చాటుకు వెళ్లిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఒక గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.
 
ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మేనల్లుడితో కలిసి అంగుల్‌లోని చెండిపడ ప్రాంతంలోని ఒక ఆసుపత్రికి వెళ్లి వస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంతలో మార్గమధ్యంలో ఆ మహిళ మూత్ర విసర్జన కోసం వాహనాన్ని ఆపమంది. ఆ తర్వాత రోడ్డు పక్కనే వున్న అటవీ ప్రాంతంలోని చెట్ల చాటుకి వెళ్లింది. ఆమె అలా ఒంటరిగా రావడాన్ని ముగ్గురు కామాంధులు గమనించారు. వారంతా ట్రాక్టర్‌పై వచ్చి తనపై లైంగిక దాడి చేశారని మహిళ ఆరోపించింది.
 
ఆ వ్యక్తులు తనను బలవంతంగా ప్రధాన రహదారి నుండి కొంత దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ మహిళ ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియజేసింది.
 
ఆగస్టు 5న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు 6న ఈ నేరానికి సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన ట్రాక్టర్, రెండు మొబైల్ ఫోన్లు, నేరం జరిగిన సమయంలో నిందితులు, బాధితురాలు ధరించిన దుస్తులు సహా అనేక నేరారోపణ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం