Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను పక్కన కూర్చోబెట్టి భార్యపై సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (22:47 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త పక్కనే కూర్చోబెట్టి భార్యపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బార్మెర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించారు. నలుగురు నిందితుల్లో ఒకరు బాధిత మహిళ భర్త వాహనాన్ని తీసుకుని ఉడాయించారు. 
 
మిగిలిన ముగ్గురు నిందితులు భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. భర్త పక్కనే కూర్చొనివుండగా ఆ మహిళబై ముగ్గురు కామాంధులు అత్యాచారు. ఆ తర్వాత ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. 
 
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆగమేఘాలపై స్పందించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని బాబులాల్, నరేష్‌లుగా గుర్తించినట్టు బార్మెర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments