నువ్వు నాకే దక్కాలి అంటూ ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:10 IST)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ విషాద ఘటన జరిగింది. తన ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసేసింది. నువ్వు నాకే సొంతం... నాతోనే శృంగారం చేయాలంటూ వాగ్వాదానికి దిగిన ప్రియురాలు ఆవేశంలో అతని మర్మాంగాన్ని కోసేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోనసీమ జిల్లా మలికిపురం మండలం, గుడుపల్లికి చెందిన ఓ వ్యక్తికి తాటిపాకకు చెందిన మరదలి వరుసయ్యే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తన ఇంట్లో ఎవరూ లేరని, తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.
 
ఆ వెంటనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్లిన తర్వాత.. నువ్వు వేరే వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నావు... నువ్వు నాకే దక్కాలి అంటూ ఆమె వాగ్వాదానికి దిగి ఆగ్రహావేశాలకు లోనైంది. ఆ క్షణికావేశంలో తన వద్ద ఉన్న బ్లేడుతో అతని మర్మాంగాన్ని కోసేసింది. 
 
దీంతో మర్మాంగానికి తీవ్ర గాయం కావడంతో రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా మెరుగైన వైద్య చికిత్స కోసం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం