Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం చేసుకున్న మహిళా న్యాయవాది ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (19:32 IST)
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళా న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగో అంతస్తు భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్, చందానగర్‌లోని లక్ష్మీ విహారం ఫేజ్-1 డిఫెన్స్ కాలనీలో జరిగింది. ఈమె నివాసం ఉంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
మృతురాలి పేరు శివాని. ఈమె ఐదేళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే, శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శివానీ ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసులో మృతురాలి భర్త అర్జున్ స్థానిక పోలీసుకు లొంగిపోయారు. 
 
మృతురాలి తల్లి హేమ మాట్లాడుతూ, తన భర్త చిన్నతనంలోనే చనిపోవడంతో తన కుమార్తెను మేనమామ బాధ్యతలు తీసుకుని చదవించారని చెప్పారు. ఈ క్రమంలో శినానికి చదివించడం వల్ల తాను అప్పులపాలు అయ్యానని తనకు రూ.10 లక్షల ఇవ్వాలంటూ మేనమామ వేధించసాగాడని, దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. 
 
శనివారం మరోమారు ఈ గొడవ జరగడంతో విసిగిపోయిన శివాని ఆత్మహత్య చేసుకునివుంటుందని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, ఆదివారం శివాని కుమారుడు రెండో పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సివుండగా, ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడంతో ఈ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments