Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఠాగూర్
సోమవారం, 21 జులై 2025 (09:06 IST)
భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపేసింది. సాంబారులో విషయం కలిపి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ధర్మపురి జిల్లా అరూర్ పరిధిలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ (35) అనే వ్యక్తికి భార్య అమ్ముబీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రసూల్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొన్ని రోజుల క్రితం ఆయనకు వాంతులు, విరేచనాలు కావడంతో అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో ఆయనను సేలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 
 
అయితే, ఆస్పత్రిలో వైద్యులు రసూల్ రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా, వాటిలో పురుగు మందు అవశేషాలు ఉన్నట్టు తేలింది. దీంతో మృతుని కుటుంబ సభ్యులు అమ్మూబీపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అమ్మూబీని అదుపులోకి తీసుకోవడంతో ఆమె మొబైల్ వాట్సాప్‌ను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. 
 
అందులో నువ్వు ఇచ్చిన కషాయం మందు దానిమ్మ జ్యూస్‌లో కలిపాను.. దాన్ని నా భర్త తాగలేదు. దీంతో సాంబారులో విషయం కలిపి అన్నంలో వడ్డించి తినిపించా అని అమ్మూబీ పేర్కొంది. ఈ కేసులో ఆమె ప్రియుడు లోకేశ్వరన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments