ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాల మాయలో కొందరు వివాహితలు దారుణానికి పాల్పడుతున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను అంతమొందిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని దోహ్రాలోనూ మరో దారుణం జరిగింది. ఈ షాకింగ్ సంఘటన వివరాలను పరిశీలిస్తే,
సుష్మిత అనే మహిళ తన భర్త కరణ్ దేవ్‌ను భర్త మరిది (భర్త సోదరుడు)తో కలిసి హత్య చేసింది. ఈ ఘటన ఈ నెల 13వ తేదీన జరిగింది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ... తొలుత భర్తను హత్య చేసేందుకు నిద్రమాతలను ఉపయోగించింది. అయితే, ఆ మాత్రలకు భర్త చనిపోకపోవడంతో కరెంట్ షాకి ఇచ్చి ప్రాణాలు తీసింది.
సుష్మిత గత కొంతకాలంగా తన మరిదితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్‌ను హత్య చేయాని ప్లాన్ చేశారు. రాత్రి భజనంలో కరణ్‌కు నిద్రాతలు కలిపారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశారు. దీని ప్రమాదంగా చూపించాలని ప్రయత్నిచారు. కాగా, నిద్ర మాత్రలు ఎంత సమయంలో పని చేస్తాయో తెలుసుకోవడానికి వారు గూగుల్‌లో కూడా శోధించారు.
సుష్మిత చెప్పిన ప్రకారం కరణ్ ఆమెను తరచూ కొడుతూ, డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అందుకే ఈ హత్యకు పాల్పడినట్టు ఆమె తెలిసింది. పోలీసులు సుష్మిత అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.