Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

ఠాగూర్
ఆదివారం, 20 జులై 2025 (20:02 IST)
ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో నాలుగో నిందితుడుగా అరెస్టయిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయమూర్తి ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. దాదాపు ఏడు గంటల పాటు విచారణ జరిపిన తర్వాత శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆయనను ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచగా, ఆగస్టు ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. 
 
ఈ కేసులో మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించగా, సిట్ తరపున కోటేశ్వర రావు వాదనలు వినిపించారు. తాము కస్టడీ కోరుతున్నందున మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్‌కు పంపాలని సిట్ కోరింది. అయితే, మిథన్ రెడ్డి ఓ ఎంపీ అని, ఆయనకు వై కేటగిరీ భద్రత ఉందని, అందువల్ల నెల్లూరు జిల్లా జైలులో ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించాలని నాగార్జున రెడ్డి కోరారు. 
 
కాగా, మద్యం స్కామ్‌లోని ప్రధాన కుట్రదారుల్లో మిథున్ రెడ్డి ఒకరని, లిక్కర్ పాలసీ రూపకల్పన, షెల్ కంపెనీలకు ముడుపుల సరఫరా వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. అలాగే, ఈ స్కామ్ ద్వారా రూ.3200 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు సిటి ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments